AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పొద్దున్నే వేడి నీళ్లలో తేనె కలిపి తాగితే… మీ పేగులు మొత్తం క్లీన్

తేనెలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది సమతుల్య ఆహారంలో భాగంగా షుగర్‌కు చెక్ పెట్టడంలో సాయపడుతుంది. తేనెను వేడి నీటిలో కలిపి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించిన సమాచారం తెలుసుకుందాం పదండి...

Health: పొద్దున్నే వేడి నీళ్లలో తేనె కలిపి తాగితే... మీ పేగులు మొత్తం క్లీన్
Warm Water With Honey
Ram Naramaneni
|

Updated on: Mar 20, 2024 | 5:19 PM

Share

తేనెటీగలు వివిధ రకాలు పువ్వుల నుంచి తేనెను సేకరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్యూరిటీ ఉన్న తేనె ఎన్నటికి చెడిపోదు. ఎందుకంటే చక్కెర కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. తేనె.. తెలుగు లోగిళ్లలో ఉపయోగించే ఒక సాదారణ ఆహార పదార్థం. హెల్త్‌కు సంబంధించిన అనేక హోమ్ రెమిడీస్ విషయంలో దీన్ని వినియోగిస్తున్నారు. ఔషధ చికిత్సలలో శతాబ్దాలుగా తేనెను ఉపయోగిస్తున్నారు. వేడి నీళ్లలో తేనె కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తేనె.. గుండె జబ్బులు, మధుమేహం నుంచి కాపాడుతుందని చెబతున్నారు. అంతేకాదు.. ప్రేగులు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుందట. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు.. చక్కెర, బెల్లంకు ప్రత్యామ్నాయంగా తేనెను ఉపయోగిస్తారు. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం…

బరువు నిర్వహణ:

గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఫుడ్ క్రేవింగ్స్‌ను అడ్డుకుంటుంది.  తద్వారా బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. 

జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది:

తేనెను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థకు ఉపశమనం కలుగుతుంది. ఇది అజీర్ణం, పొట్ట ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ప్రీబయోటిక్ లక్షణాల గల తేనె ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. తేనెలో యాంటీఆక్సిడెంట్,  యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి.

చర్మ కాంతిని పెంచుతుంది:

తేనెతో కలిపిన గోరువెచ్చని నీరు  మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. తేనె  మాయిశ్చరైజింగ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను పెంచుతుంది. చాలా చర్మ ఉత్పత్తులలో తేనెను వినియోగిస్తారు.

నొప్పి నివారిని:

తేనెలోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని అందిస్తాయి. వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కథన మీకు అందించటం జరిగింద ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించండి)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..