Snake Venom Addiction: ప్రాణాలు తీసే పాము విషం.. పార్టీల్లో మత్తెక్కిస్తోందా..?

Snake Venom Addiction: ప్రాణాలు తీసే పాము విషం.. పార్టీల్లో మత్తెక్కిస్తోందా..?

Anil kumar poka

|

Updated on: Mar 20, 2024 | 8:28 PM

తెలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ గురించి... దానిపై జరిగే వేల కోట్ల వ్యాపారం గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇవాళ మనం డ్రగ్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కానీ... ఇది మీరనుకునే డ్రగ్స్ కాదు. బహుశా ఇంత వరకు మీలో కొంత మంది పెద్దగా విని ఉండకపోవచ్చు కూడా. అసలు దాన్ని మత్తు కోసం కూడా ఉపయోగిస్తారా.. అని మరి కొంతమంది నోరెళ్లబెట్టిన ఆశ్చర్యం లేదు.

తెలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ గురించి… దానిపై జరిగే వేల కోట్ల వ్యాపారం గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇవాళ మనం డ్రగ్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కానీ… ఇది మీరనుకునే డ్రగ్స్ కాదు. బహుశా ఇంత వరకు మీలో కొంత మంది పెద్దగా విని ఉండకపోవచ్చు కూడా. అసలు దాన్ని మత్తు కోసం కూడా ఉపయోగిస్తారా.. అని మరి కొంతమంది నోరెళ్లబెట్టిన ఆశ్చర్యం లేదు. పాము .. దాని విషం అనగానే తేడా వస్తే ప్రాణాలు తీస్తుంది.. జాగ్రత్తగా ఉపయోగిస్తే ప్రాణం పోస్తుందని మాత్రమే తెలుసు కదా.. కానీ అది మత్తులో తూగిపోయేలా కూడా చేస్తుంది. ఇక్కడ మీకు ఢిల్లీలో గత మూడు నాలుగు నెలలుగా నలుగుతూ ఓ కేసు గురించి చెబుతా. నిజానికి ఇదో వీఐపీ కేసే. అయితే ఆయన ఉత్తరాది వారికి వీఐపీ… తెలుగు వాళ్లకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. అయితే రెగ్యులర్‌గా ఎంటర్టైన్మెంట్ న్యూస్, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి మాత్రం తెలిసి ఉన్నా ఆశ్చర్యపోవాల్సినవసరం లేదు.

ఇదుగో ఈయనగారో ఎల్విష్ యాదవ్. బిగ్ బాస్ ఓటీటీ విన్నర్. అయితే తెలుగు బిగ్ బాస్ కాదు.. అందుకే చాలా తక్కువ మందికి తెలిసే ఛాన్సుందని ముందే చెప్పా. ఈ పెద్దమనిషిని తాజాగా అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. కారణం.. రేవ్ పార్టీలకు ఇతగాడు పాము విషాన్ని అరెంజ్ చేస్తున్నడన్నది ఆయనపై వచ్చిన ఆరోపణలు. గత ఏడాది నవంబర్ 3న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇల్లీగల్‌గా రేవ్ పార్టీలకు ఎల్విష్ పాముల విషాన్ని సరఫరా చేస్తున్నాడన్నది ఆయనపై వచ్చిన ఆరోపణలు. దీంతో ఆయనపై వన్య ప్రాణి సంరక్షణలు ఉల్లంఘించారన్న పేరిట కేసు నమోదు చేశారు. నిజానికి అందరు నేరస్థుల్లానే ఎల్విష్ కూడా తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధం అని కొట్టి పారేశాడు. కానీ ఆ తర్వాత విచారణలో అసలు నిజం కక్కించారు పోలీసులు. సరిగ్గా ఈ కేసే.. ఇప్పుడు పాము విషం గురించి దేశమంతా చర్చించుకునేందుకు అసలు కారణం. అసలు ప్రాణాలు తీసే పాము విషం.. మత్తులో ముంచే ఛాన్సుందా… నెటిజన్లంతా ఇప్పుడు దాని గురించే వెతుకుతున్నారు. ఈ విషయంలో అసలు చట్టం ఏం చెబుతోంది.. మన దేశంలో ఇలాంటి అలవాటు.. అలాగే ఇలాంటి కేసులు సర్వ సాధారణమా..? ఇలా రక రకాల ప్రశ్నలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..