Banana: అరటిని అస్సలు చిన్నచూపు చూడొద్దు.. పోషకాల నిధి అని చెప్పినా తక్కువే
రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలానే, రోజూ అరటిపండు తింటే కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అరటిపండ్లు, సరైన సమయంలో, సరైన పరిమాణంలో తీసుకుంటే, శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా ఆకలిగా ఉన్నప్పుడు, ఉపవాస సమయంలో లేదా అల్పాహారం సమయంలో అరటిపండు తింటుంటారు చాలామంది. అరటి పండు తిన్న వెంటనే శక్తి ఇస్తుంది. కొందరు అరటి పండ్లు తినేందుకు ఆసక్తి చూపించరు. అయితే వాటి ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు. అరటి పండు తినడానికి రుచికరమైన పండు మాత్రమే కాదు, అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇలా పోషకాలు పుష్కలంగా ఉండే అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో చూద్దాం.
జీర్ణక్రియకు మంచిది: అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అరటిపండు తినడం జీర్ణక్రియకు మంచిది. అలాగే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అరటిపండులో ఉండే పెస్టిన్ మలబద్దకాన్ని నివారిస్తుంది.
రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది: మీరు రక్తపోటులో హెచ్చుతగ్గులతో బాధపడుతుంటే లేదా మీరు త్వరగా అలసిపోతున్నట్లు అనిపిస్తే అరటిపండ్లను తినాలి. ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఎముకలను బలపరుస్తుంది: అరటిపండ్లు తీసుకోవడం వల్ల మీ ఎముకలు బలపడతాయి, ఎందుకంటే అరటిపండులో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది, ఇది మీ ఆహారం నుండి కాల్షియంను గ్రహించి ఎముకలను బలోపేతం చేస్తుంది. రోజూ అరటిపండు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు ఎముకల సాంద్రత పెరుగుతుంది. మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే, ఖచ్చితంగా ప్రతి రోజు అరటిపండు తినండి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది: డయాబెటిక్ పేషెంట్లకు పెద్ద సమస్య ఏమిటంటే వారు ఏ పండ్లు తినాలి.. ఏం తినకూడదు అన్నది తెలియదు. అరటిపండ్లు రుచిలో తియ్యగా ఉంటాయి కాబట్టి చాలా మంది తినడానికి దూరంగా ఉంటారు. అరటిపండులో పీచుపదార్థం ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండు తింటే మంచిది. ఫైబర్ తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
గుండె రోగులకు మంచిది: గుండె జబ్బులు ఉన్నవారు అరటిపండు తినాలి. అరటిపండులోని విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది: రక్తహీనతతో బాధపడేవారు అరటిపండు తినాలి. ఇందులో మంచి మొత్తంలో ఇనుము లభిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది.
జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది: అరటిపండ్లలో విటమిన్ బి-6 పుష్కలంగా ఉంటుంది. మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
అరటిపండు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది: అరటిపండు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ట్రైటోఫాన్ ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ ఒత్తిడిని తగ్గించడానికి చాలా ఉపయోగకరమైన హార్మోన్. కాబట్టి అరటిపండును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
అరటి ఒక పవర్‌హౌస్: అరటిపండు ఒక శక్తి కేంద్రం. ఇది కార్బోహైడ్రేట్ల మంచి మూలం. అరటిపండు తినడం వల్ల శరీరానికి త్వరగా శక్తి వస్తుంది. రోజూ ఉదయాన్నే అరటిపండు తింటే రోజంతా శక్తివంతంగా ఉంటుంది.
అరటిపండు చర్మానికి మేలు చేస్తుంది: మీరు చర్మ సంబంధిత సమస్యలతో పోరాడుతుంటే అరటిపండు ఆ సమస్యకు చాలా మేలు చేస్తుంది. ఇది మీ చర్మ సమస్యను నయం చేస్తుంది. అరటిపండు తినడం వల్ల ముఖం కాంతివంతంగా, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
అరటి పోషకాల నిధి: అరటిపండు అనేక పోషకాల పవర్ ఫ్రూట్. ఇతర పండ్ల కంటే అరటిపండులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, బి, బి6, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. ఈ పోషకాలన్నీ మన శరీరానికి చాలా అవసరం.
(ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమ మార్గం.)




