Health: అరటిపండు, బొప్పాయి కలిపి తింటే అనారోగ్యానికి గురవుతారా..? ఇదిగో క్లారిటీ
అరటి పండు, బొప్పాయిని కలిపి తీసుకోవడం ద్వారా ఆరోగ్యంపై చేడు ప్రభావం చూపుతుందా..? వీటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందా?.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి...

మన ఆరోగ్యానికి పండ్లు చాలా అవసరం. పండ్ల ద్వారా ప్రొటీన్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. అందుకే డైలీ ఫ్రూట్స్ తినమని డాక్టర్లు చెబుతుంటారు. కొంతమంది వివిధ రకాల పండ్లను సలాడ్ రూపంలో తినడానికి ఇష్టపడతారు. అరటిపండు, బొప్పాయి కలిపి తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. అయితే ఈ 2 ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను తెలుసుకుందాం పదండి..
అరటిపండు, బొప్పాయి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదా, చెడ్డదా అనే ప్రశ్నకు సమాధానం మన జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అరటి, బొప్పాయి రెండు విభిన్న స్వభావం కలిగిన పండ్లు కాబట్టి, వాటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇలా తినకపోవడమే మంచిదని అంటున్నారు. అరటిపండు, బొప్పాయి కలిపి తింటే వాంతులు, తలనొప్పి, వికారం, ఎసిడిటీ, గ్యాస్టిక్ ప్రాబ్లెమ్, అలర్జీ వంటి సమస్యలు వస్తాయట. ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఈ పండ్ల కాంబినేషన్ తినడం వల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందట. బొప్పాయి, అరటిపండు కలిపి తింటే కడుపు నొప్పికి కూడా కారణం కావచ్చు.
కాగా కామెర్లు బాధపడుతున్నవారు బొప్పాయి తినకూడదని కూడా డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఇందులోని పపైన్, బీటా కెరోటిన్ కామెర్లు సమస్యను పెంచుతుందని చెబుతున్నారు. ఇక శరీరంలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటే అరటిపండ్లను తినకూడదు. ఇది శరీరంలో తీవ్రమైన సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.
(ఈ స్టోరీ కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.)
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




