Health: గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి, వెన్న తినొచ్చా..?
చాలా మంది హృద్రోగులు తమ డైట్‌లో నెయ్యి, వెన్నను చేర్చుకోవచ్చా లేదా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఈ విషయంలో నిపుణులు ఇచ్చిన సలహాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి...

ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఫాస్ట్‌ఫుడ్, స్మోకింగ్, డ్రింకింగ్ కారణంగా ప్రజలు అధిక రక్తపోటు, పక్షవాతం, గుండె జబ్బుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వయస్సు మీదపడినవారిలో మాత్రమే కాదు యువతలో కూడా ఈ తరహా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండె రోగులు తమ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకుంటే, ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మనం తినే ఆహారంలో పెద్ద మొత్తంలో కొవ్వు ఉంటే కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. హృద్రోగులు నెయ్యి లేదా వెన్న తినడం తగ్గిస్తే బెటర్ అన్నది నిపుణుల వెర్షన్. ఎందుకంటే నెయ్యి లేదా వెన్నలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
చాలా మంది హృద్రోగులు తమ డైట్‌లో నెయ్యి లేదా వెన్న లేకుండా జాగ్రత్త పడతారు. ఈ విషయంలో నిపుణులు ఏం సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. హృద్రోగులు ఇంట్లో తయారుచేసిన వెన్న లేదా నెయ్యిని తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చట. అలానే జున్ను, బీన్స్, కూరగాయలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినొచ్చట. చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాన్ని అవౌడ్ చేయడం బెటర్ అని చెబుతున్నారు. మీ ఆహారంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోవడం చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి. సరైన సమయంలో ఆహారం తినడం, టైమ్ పడుకోవడం వంటి అలావాట్లు పాటించండి. అలాగే మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి..
(ఈ స్టోరీ కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.)
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




