బెల్లీ డాన్స్‌తో అదరగొట్టిన శ్రీదేవి డాటర్
అందాల తార జాన్వీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. బ్యూటీలో శ్రీదేవికి ఏ మాత్రం తగ్గని జాన్వీ నటనలో తల్లి స్థాయిని అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ధడక్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలి ప్రయత్నమే ఆకట్టుకుంది. ధడక్ లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అటుపై కెరీర్ పరంగా వెనుదిరిగి చూసే పనే లేకుండా దూసుకుపోతోంది. వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశంలో తొలి […]
అందాల తార జాన్వీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. బ్యూటీలో శ్రీదేవికి ఏ మాత్రం తగ్గని జాన్వీ నటనలో తల్లి స్థాయిని అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ధడక్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలి ప్రయత్నమే ఆకట్టుకుంది. ధడక్ లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అటుపై కెరీర్ పరంగా వెనుదిరిగి చూసే పనే లేకుండా దూసుకుపోతోంది. వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశంలో తొలి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవితకథలో నటిస్తున్న జాన్వీ తదుపరి `తక్త్` అనే భారీ హిస్టారికల్ చిత్రంలో నటించనుంది. మరో హారర్ కామెడీ మూవీకి కూడా సైన్ చేసింది.
ఇక అందాన్ని, ఫిజిక్‌ను కాపాడుకోడానికి రెగ్యులర్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంది. ఫిజికల్ ఫిట్ నెస్ తో పాటు పలు రకాల నృత్యాల్లోనూ శిక్షణ పొందుతోంది. తాజాగా జాన్వీ బెల్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని ప్రముఖ బాలీవుడ్ ఫోటో జర్నలిస్ట్ వైరల్ భయానీ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశారు. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో నడుము ఊపులను ఎంతో అలవోకగా ప్రదర్శిస్తూ జాన్వీ అదరగొట్టేస్తోంది. ఇలానే కంటిన్యూ చేస్తే మున్ముందు జాన్వీతో మూవీ చేయడానికి ప్రొడ్యూసర్లు పోటీ పడాల్సిందేనేమో.