హమ్మయ్య సస్పెన్స్ వీడింది..‘సాహో’ మ్యూజిక్ డైరక్టర్ ఎవరంటే?
‘బాహుబలి’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రస్టేజియస్ మూవీ ‘సాహో’. యంగ్ డైరక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ నుంచి సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి స్థానాన్ని జిబ్రాన్ భర్తీ చేయనున్నారు. ఈ సినిమాకు ఆయన సంగీతం అందించనున్నట్లు మూవీ యూనిట్ అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసింది. గతంలో ఈయన సుజిత్ తెరకెక్కించిన ‘రన్ రాజా రన్’ కి కూడా మ్యూజిక్ అందించాడు. […]
‘బాహుబలి’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రస్టేజియస్ మూవీ ‘సాహో’. యంగ్ డైరక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ నుంచి సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి స్థానాన్ని జిబ్రాన్ భర్తీ చేయనున్నారు. ఈ సినిమాకు ఆయన సంగీతం అందించనున్నట్లు మూవీ యూనిట్ అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసింది. గతంలో ఈయన సుజిత్ తెరకెక్కించిన ‘రన్ రాజా రన్’ కి కూడా మ్యూజిక్ అందించాడు. ఆ ఆల్బమ్ అప్పట్లో మంచి హిట్ అయింది. వీటితో పాటు ‘విశ్వరూపం’, ‘జిల్’, ‘బాబు బంగారం’ లాంటి మూవీస్‌కు కూడా సంగీత దర్శకుడిగా పనిచేశారు. ‘సాహో చాప్టర్ 2’కి కూడా ఆయనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.
కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నీల్ నితిన్ ముకేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆగస్టు 15న సినిమా విడుదల కాబోతోంది.