ఏఏ19 సెట్స్‌లో క్రికెట్ మ్యాచ్ సందడి..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇక ఈ షూటింగ్‌లో హీరోయిన్ పూజా హెగ్డే‌తో పాటు మిగిలిన నటీనటులంతా పాల్గొంటున్నారు. ఇది ఇలా ఉండగా ఇవాళ మాంచెస్టర్ వేదిక చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్థాన్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌ను సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీస్ […]

ఏఏ19 సెట్స్‌లో క్రికెట్ మ్యాచ్ సందడి..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 16, 2019 | 9:13 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇక ఈ షూటింగ్‌లో హీరోయిన్ పూజా హెగ్డే‌తో పాటు మిగిలిన నటీనటులంతా పాల్గొంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఇవాళ మాంచెస్టర్ వేదిక చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్థాన్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌ను సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీస్ కూడా వీక్షిస్తున్నారు. అటు బన్నీ కూడా ఓ పక్క షూటింగ్ చేస్తూనే.. ఈ మ్యాచ్‌ను తిలకిస్తున్నాడు.

కాగా బన్నీ తన ఫోన్‌లో మ్యాచ్ చూస్తున్న దృశ్యాన్ని హీరోయిన్ పూజా హెగ్డే తన కెమెరాలో బంధించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  బన్నీ గత చిత్రం ‘నా పేరు సూర్య’ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.