తండ్రితో డెబ్యూ ఇస్తోన్న తనయుడు
కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అది కూడా మొదటి సినిమాలోనే తన తండ్రితో కలిసి పనిచేస్తున్నాడు. అయితే ఆర్యన్ హీరోగా రావడం లేదు. ఓ సినిమాకు షారూక్, ఆర్యన్ హిందీలో డబ్బింగ్ చెప్తుండగా.. దీంతో మొదటిసారిగా బాలీవుడ్‌లో ప్రేక్షకులకు తన గాత్రాన్ని మాత్రమే పరిచయం చేస్తున్నాడు ఆర్యన్. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ డిస్నీ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న మరో విజువల్ వండర్ ద లయన్ కింగ్. జోన్ ఫేవ్‌ర్యూ దర్శకత్వం […]
కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అది కూడా మొదటి సినిమాలోనే తన తండ్రితో కలిసి పనిచేస్తున్నాడు. అయితే ఆర్యన్ హీరోగా రావడం లేదు. ఓ సినిమాకు షారూక్, ఆర్యన్ హిందీలో డబ్బింగ్ చెప్తుండగా.. దీంతో మొదటిసారిగా బాలీవుడ్‌లో ప్రేక్షకులకు తన గాత్రాన్ని మాత్రమే పరిచయం చేస్తున్నాడు ఆర్యన్.
వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ డిస్నీ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న మరో విజువల్ వండర్ ద లయన్ కింగ్. జోన్ ఫేవ్‌ర్యూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో జూలై 19న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ హిందీ వెర్షన్‌లో ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పబోతున్నారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, ఆయన తనయుడు ఆర్యన్.
రాజు సింహం ముఫాసకు షారూక్.. పిల్ల సింహం సింబాకు ఆర్యన్ తమ వాయిస్‌లను ఇస్తున్నారు.దీని గురించి డిస్నీ ఇండియా స్టూడియో హెడ్ విక్రమ్ దుగ్గల్ మాట్లాడుతూ.. ‘‘ముఫాస, సింబా పాత్రలకు షారూక్, ఆర్యన్ కంటే బాగా డబ్బింగ్ చెప్పేవారు దొరకరు. వీరి గాత్రంతో పాత్రలకు జీవం పోస్తారని భావిస్తున్నాం’’ అంటూ తెలిపాడు. ఇదిలా ఉంటే ముఫాస, సింబ పేర్లతో కూడిన టీ షర్టులు షారూక్, ఆర్యన్ ధరించగా.. దానికి సంబంధించిన ఫొటోను కింగ్‌ఖాన్ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.