AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sravana Bhargavi: మళ్ళీ వార్తల్లో సింగర్ శ్రావణ … అన్నమయ్య కీర్తనని రొమాంటిక్ సాంగ్ గా మార్చేసి వివాదానికి..

శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తనను ప్రైవేట్ ఆల్బమ్ లా చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తనను దుర్వినియోగం చేయడాన్ని ఆయన వంశీయులు తప్పు పడుతున్నారు

Sravana Bhargavi: మళ్ళీ వార్తల్లో సింగర్ శ్రావణ ... అన్నమయ్య కీర్తనని రొమాంటిక్ సాంగ్ గా మార్చేసి వివాదానికి..
Singer Sravana Bhargavi
Surya Kala
|

Updated on: Jul 20, 2022 | 12:06 PM

Share

Sravana Bhargavi: గత కొంతకాలంగా టాలీవుడ్ (Tollywood) సింగర్ శ్రావణ భార్గ (Singer Shravan Bargavi) వి.. ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తోవుంది. తాజాగా శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తన రొమాంటిక్ సాంగ్ గా మార్చేసి వివాదానికి తెరతీసింది. ఒకపరి వయ్యారమే అనే అన్నమయ్య సంకీర్తనను ఆల్బమ్ చేసిన సింగర్ శ్రావణ భార్గవి అన్నమయ్య వంశీకుల ఆగ్రహానికి గురైంది. సాంప్రదాయ విరుద్ధంగా ఆల్బమ్ లో నటించడంపై అభ్యంతరం వ్యక్తం అవుతుంది. శ్రావణి భార్గవి ఆల్బమ్ ను టీటీడీ తీసుకెళ్లిన అన్నమయ్య వంశం చట్ట ప్రకారం చర్యలకు సిద్దమంటోంది. సోషల్ మీడియా నుంచి తొలగించకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటోంది.

తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య 32 వేల సంకీర్తనలను ఆలపించిన పద కవితా పితామహుడు. శ్రీవారిని వేలాది కీర్తనలతో ఆలపించిన అన్నమయ్య గొప్ప వైష్ణవ భక్తుడిగా కీర్తిని సొంతం చేసుకున్నాడు. శ్రీవారి సేవలో తరించిన అన్నమయ్య కీర్తనలతోనే టీటీడీ ఇప్పటికీ వెంకన్నకు కైంకర్యాలు నిర్వహిస్తోంది. మేల్కొలుపు నుంచి ఏకాంత సేవ వరకు అన్నమయ్య వారసులు ఇప్పటికే శ్రీవారి సేవలోనే తరిస్తున్నారు. ఆయన కీర్తనలను ఆలపిస్తున్నారు.

అయితే ఇప్పుడు శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తనను ప్రైవేట్ ఆల్బమ్ లా చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తనను దుర్వినియోగం చేయడాన్ని ఆయన వంశీయులు తప్పు పట్టడంతో ఈ వ్యవహారం కొత్త చర్చకు దారి తీసింది. వివాదస్పదంగా మారిన సింగర్ శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తనల ఆల్బమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడంతో అన్నమయ్య వంశీకుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుంది. స్వామివారిపై భక్తిశ్రద్దలతో అన్నమయ్య రచించిన సంకీర్తనలను రొమాంటిక్ గా పాడటం, నటించడాన్ని ప్రశ్నిస్తున్న అన్నమయ్య వంశికులు శ్రావణి భార్గవి తీరును తప్పుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీవారిని కీర్తిస్తూ రచించిన సంకీర్తనలను అస్యభకరంగా చిత్రికరించడం భాథాకరమన్న అన్నమయ్య వంశీకులు హరినారాయణా చార్యులు ఈ అంశం పై శ్రావణభార్గవి స్పందన మరింత భాదించిందన్నారు.ఈ అంశాన్ని టిటిడి దృష్టికి తీసుకెళ్ళి కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో అన్నమయ్య కీర్తనలను బాగా చూపారని ఆ సినిమాలో అభ్యంతరకరంగా లేదన్నారు. హిందువుగా ఉండి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శ్రావణి భార్గవి ఇలా అన్నమయ్య కీర్తనలను అవమానపరిచేలా చిత్రీకరించడం సరి కాదన్నారు. తిరుమల శ్రీవారిని మేల్కొల్పి ఏకాంత సేవతో పవళింపు వరకు అన్నమయ్య కీర్తనలను ఆలపించే తమను శ్రావణి భార్గవి ఇలాంటి పాటలతో బాధపెట్టిందన్నారు.వెంటనే సోషల్ మీడియా నుంచి ఈ ఆల్బమ్ ను తొలగించాలన్నారు. లేదంటే చట్ట ప్రకారం ముందుకు వెళతామన్నారు. హరి నారాయణచార్యులు,అన్నమయ్య వంశీకులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్త ల కోసం ఇక్కడ క్లి చేయండి,,