Vastu Tips: శ్రావణంలో శివుడి అనుగ్రహం పొందాలంటే.. తులసిని ఈ మొక్కలలో కలిపి పూజించండి..

వాస్తు ప్రకారం. తులసి మొక్కతో పాటు ఇతర మొక్కలను నాటడం ద్వారా ఇంట్లో ఆనందం, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో శివపార్వతుల సమేతంగా తులసి మొక్కను పూజించడం, పారాయణం చేస్తారు. 

Vastu Tips: శ్రావణంలో శివుడి అనుగ్రహం పొందాలంటే.. తులసిని ఈ మొక్కలలో కలిపి పూజించండి..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Jul 09, 2022 | 11:02 AM

Vastu Tips: తులసి మొక్క పవిత్ర మొక్కగా భావిస్తారు.. హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ మొక్క గురించి గ్రంధాలలో కూడా ప్రస్తావించబడింది. ఇది విష్ణువు, లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. తులసి మొక్క ప్రాముఖ్యత జ్యోతిష్యంలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా ప్రస్తావించారు. వాస్తు ప్రకారం.. ఈ పవిత్రమైన మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల జీవితంలో సుఖసంపదలు లభిస్తాయి. ఇంటి వైపు వచ్చే నెగెటివ్ ఎనర్జీ దూరంగా ఉండి సానుకూల వాతావరణం నెలకొంటుంది. వాస్తు ప్రకారం. తులసి మొక్కతో పాటు ఇతర మొక్కలను నాటడం ద్వారా ఇంట్లో ఆనందం, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో శివపార్వతుల సమేతంగా తులసి మొక్కను పూజించడం, పారాయణం చేస్తారు.

మీరు శ్రావణ మాసం 2022 లో వాస్తు ప్రకారం కొన్ని చర్యలు తీసుకుంటే.. ఆర్ధిక ఇబ్బందుల సహా జీవితంలోని అనేక సమస్యలను అధిగమించవచ్చు. శ్రావణ మాసంలో తులసితో పాటు ఏయే మొక్కలను నాటడం ద్వారా మీరు ఇంట్లో సుఖశాంతులను కాపాడుకోవచ్చు ఈరోజు తెలుసుకుందాం..

తులసి, జమ్మి మొక్క మీరు ఇంట్లో శ్రావణ మాసంలో తులసితో పాటు జమ్మి మొక్కను కూడా ఉంచవచ్చు. సనాతన ధర్మంలో  ఈ రెండు మొక్కలు చాలా పవిత్రమైనవి. వీటిని పూజించడం ద్వారా, జీవితంలోని అనేక సమస్యలను అధిగమించవచ్చు. జమ్మి మొక్క విష్ణువు అవతారమైన రాముడికి సంబంధించినదని నమ్మకం.  లంకపై దండయాత్రకు ముందు రాముడు ఈ పవిత్ర మొక్కను పూజించాడు. అదే సమయంలో, పాండవులు తమ ఆయుధాలను దాచడానికి ఈ మొక్క సహాయం తీసుకున్నారు. ఈ రెండు మొక్కలను శ్రావణ మాసంలో ఇంట్లో నాటండి. క్రమం తప్పకుండా పూజ చేయండి. మీరు ఈ మొక్కలను ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

ఉమ్మెత్త, తులసి మొక్క ఉమ్మెత్త మొక్క శివునికి సంబంధించినదని నమ్మకం. దీనిని తులసి మొక్కతో నాటడం కలిపి వలన శివుడి అనుగ్రహం పొందడానికి మీకు చాలా సహాయపడుతుందని పురాణాల కథనం. తులసితో ఉమ్మెత్త మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఏర్పడే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అదే సమయంలో ఆనందం, శ్రేయస్సుతో నిండిన వాతావరణం ఏర్పడుతుంది.  అయితే ఈ రెండు మొక్కలు కలిపి నాటాలనుకుంటే, దాని కోసం ప్రత్యేకమైన రోజును ఎంచుకోండి. తులసికి ఆదివారం శుభప్రదంగా భావించినప్పటికి..  సోమవారం ఇంట్లో ఉమ్మెత్త మొక్కను నాటాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)