AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శత్రువులుగా మారుతున్న మిత్రులు..!

టాలీవుడ్‌ యంగ్ హీరోలు ఎన్టీఆర్‌, మంచు మనోజ్‌లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఒకే సంవత్సరం, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో జన్మించారు

శత్రువులుగా మారుతున్న మిత్రులు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2020 | 11:42 AM

Share

టాలీవుడ్‌ యంగ్ హీరోలు ఎన్టీఆర్‌, మంచు మనోజ్‌లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఒకే సంవత్సరం, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో జన్మించారు. మేజర్ చంద్రకాంత్‌ సినిమా షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. ఆ తరువాత మంచి స్నేహితులుగా మారి తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఒకరిపై మరొకరి ప్రేమను ఈ ఇద్దరు పలుమార్లు బయటపెట్టారు. ఇదంతా పక్కనపెడితే ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు శత్రువులుగా మారబోతున్నారట.

అయితే నిజంగా కాదులెండి. ఎన్టీఆర్ సినిమా కోసం మనోజ్‌ విలన్‌గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న ఎన్టీఆర్‌, ఆ తరువాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా.. పనిలో పనిగా నటీనటులను ఎంచుకున్నారట త్రివిక్రమ్‌. ఈ క్రమంలో ఇందులో విలన్‌గా మనోజ్‌ను తీసుకోవాలని మాటల మాంత్రికుడు అనుకున్నారట. దీనికి సంబంధించి మనోజ్‌తో సంప్రదింపులు జరపడం, ఓకే అవ్వడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకు మనోజ్‌ మరో అస్సెట్‌ అవుతాడనడంలో ఎలాంటి సందేహం ఉండదు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది.

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం