AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొంగ‌ల్ రేసులో పవన్ ‘వకీల్​సాబ్’…!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ ఇప్పుడు రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణం చేస్తున్నారు. ఒక‌వైపు రాజ‌కీయాల్లో, మ‌రోవైపు సినిమాల్లో త‌న మార్క్ చూపిస్తున్నారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆయ‌న‌‌ లాయర్‌గా నటిస్తున్న చిత్రం 'వకీల్‌ సాబ్‌'. ఈ వేసవికి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని భావించారు.

పొంగ‌ల్ రేసులో పవన్ 'వకీల్​సాబ్'...!
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2020 | 9:59 AM

Share

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ ఇప్పుడు రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణం చేస్తున్నారు. ఒక‌వైపు రాజ‌కీయాల్లో, మ‌రోవైపు సినిమాల్లో త‌న మార్క్ చూపిస్తున్నారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆయ‌న‌‌ లాయర్‌గా నటిస్తున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఈ వేసవికి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని భావించారు. అందుకు తగ్గట్లుగా చాలా వేగంగా షూటింగ్ చేశారు. కాని అనుకోకుండా మార్చిలో కరోనా వ్యాప్తి ప్రారంభ‌మ‌వ్వ‌డంతో లాక్​డౌన్ విధించడం వల్ల షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. దీంతో మూవీ యూనిట్ ప్లానింగ్ అంతా మారిపోయింది. దసరాకు విడుదల చేయాలనుకున్నా అది కూడా జ‌రిగే ప‌నిలా లేదు. అయితే ఇప్పుడు ‘వకీల్​సాబ్’ను వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నార‌ట మేక‌ర్స్.​​

ఇప్పటికే పొంగ‌ల్ రేసులో ఉన్న రాజమౌళి ‘ఆర్‌ఆర్ఆర్’‌తో పాటు..మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, మహేశ్ ‘సర్కారు వారి పాట’, అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాలు అనుకున్న స‌మ‌యానికి వచ్చేలా కనిపించడం లేదు. అందుకే ‘వకీల్‌సాబ్’ను పండగ బరిలో నిలపాలని ప‌వ‌ర్ స్టార్ అభిమానుల‌కు డ‌బుల్ బోనాంజా ఇవ్వాల‌ని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Follow Us