AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుష్ప’ను వదులుకునేందుకు బాధపడ్డా.. కానీ తప్పలేదు

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని ఫైనల్ చేసినట్లు మొదటి నుంచి టాక్ నడిచింది.

'పుష్ప'ను వదులుకునేందుకు బాధపడ్డా.. కానీ తప్పలేదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 14, 2020 | 8:06 AM

Share

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని ఫైనల్ చేసినట్లు మొదటి నుంచి టాక్ నడిచింది. అయితే ఆ తరువాత కొద్ది రోజులకే ఈ మూవీ నుంచి విజయ్ తప్పుకున్నట్లు మరోసారి వార్తలు వినిపించాయి. ఇక పుష్ప నుంచి ఈ నటుడు తప్పుకోవడంపై పలు రకాల పుకార్లు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే పుష్ప నుంచి తాను తప్పుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విజయ్‌.. అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు.

డేట్లను అడ్జెస్ట్ చేయలేకే పుష్ప నుంచి తాను తప్పుకున్నానని విజయ్ సేతుపతి తెలిపారు. డేట్ల విషయంపై సుకుమార్‌ని వ్యక్తిగతంగా కలిశానని.. అవి ఎలా ఉన్నా తాము మేనేజ్ చేసుకుంటామని ఆయన తనకు చెప్పారని అన్నారు. అయితే మాట ఇచ్చి తరువాత టీమ్‌ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే ఈ మూవీ నుంచి తాను తప్పుకున్నట్లు విజయ్ వెల్లడించారు. ఇక ఈ సినిమా కథ చాలా బావుందని.. ఈ ప్రాజెక్ట్‌ని వదులుకునేందుకు బాధపడ్డా, తప్పలేదని వివరించారు. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించుండగా.. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి