గోస్వామి తులసీదాస్.. 16వ శతాబ్దపు కవులలో ప్రసిద్ధి చెందిన మహా కవి.. ఉత్తరప్రదేశ్‌లో జన్మనించిన గోస్వామి తులసీదాస్ ఎన్నో రచనలు చేశారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా హిందీలో పుస్తకాలు రాశారు. తులసీదాస్.. తత్వవేత్తగా.. సంఘసంస్కర్తగా, రాముని భక్తునిగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రచనలు భారతీయ సంస్కృతి, కళలపై, సమాజంపై ఎంతో ప్రభావం చూపాయి. గోస్వామి తులసీదాస్ రచనల ఆధారంగా రామగాథలు, నాటకాలు, హిందూస్థానీ సాంప్రదాయ సంగీతం, టెలివిజన్ సీరియల్స్ అనేకం వచ్చాయి. అయితే, గోస్వామి తులసీదాసును ఇప్పటివరకు ప్రసిద్ధ రామచరిత్ మానస్ వంటి పురాణ రచయితగా మాత్రమే చూస్తారు. తులసీదాస్ రాముని రామచరిత్ మానస్ (రామాయణం) ను హిందీమూలంలో రచించి ఈ సృష్టిని అజరామరం చేశాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా గోస్వామి తులసీదాస్ శ్రీరాముడిని ప్రత్యక్ష దర్శనం చేసుకున్నారని చెబుతారు. గోస్వామి తులసీదాస్ రామచరిత్ మానస్‌తో పాటు ఆంజనేయుని హనుమాన్ చాలీసాను కూడా రచించారు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలను రచించి.. సాహిత్య ప్రపంచంలో ఎనలేని గుర్తింపును పొందారు. రామాయణాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకి అవతారమే.. తులసీదాస్ అంటారు. భక్తి, కావ్య రచన, ఆధ్యాత్మికత, భాష లాంటివి చూసి ఆయన అపర వాల్మీకి అనటానికి ఎలాంటి సందేహమూ లేదని..చాలా మంది కవులు పేర్కొంటారు. తులసీదాస్ రచనలు.. మనవాళికి గొప్ప వరం.. ఆయన విజయ రహస్యంపై ఎన్నో కవితలు, రచనలు వచ్చాయి. కానీ, వేటికవే సమాజంలో గొప్ప ప్రాచుర్యం పొందాయి.
అయితే, తులసీదాస్ విజయ రహస్యాలు దాగున్న ఆ ఐదు రచనలు ఏంటీ..? కష్టకాలంలో ఆదుకునే వారు ఎవరు..? తులసీదాస్ స్ఫూర్తిదాయకమైన రచనలను ఎవరైతే జీవితంలో ఆచరిస్తారో.. వారు ఘనమైన కీర్తి దక్కుతుందని విశ్వసిస్తారు.. తులసీదాస్ రచనలపై ఇప్పటికే.. ఎన్నో కళాఖండాలు, సినిమాలు సైతం వచ్చాయి. అయితే, ఆయన విజయ రహస్యం వెనుక దాగున్న అంశాలు మాత్రం తక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీనివెనుక ఉన్న అంశాలను ప్రముఖ దర్శకుడు కేవల్ కపూర్ వెబ్ సిరీస్‌గా తీసుకువచ్చారు.
ప్రముఖ జర్నలిస్ట్, డిజిటల్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కేవల్ కపూర్.. 16వ శతాబ్దపు ఉత్తమ కవి తులసీదాస్‌పై అద్భుతమైన డిజిటల్ సిరీస్‌తో.. వచ్చారు. ఇందులో తులసీదాస్ అన్ని విజయ రహస్యాలను ఆయన వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఇది అనేక ఎపిసోడ్‌లతో ప్రేక్షకులను అలరించనుంది. శ్రీరామయణ గ్రంధంతోపాటు.. తులసీదాస్ ప్రస్థానం.. ఆయన చేసిన సేవలు, రచించిన రచనలను దీనిలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.
ప్రేక్షకులు.. కవి ప్రయాణంలో దాగున్న నిజం, వాస్తవాలను ఆసక్తికరమైన కథనాల ద్వారా చాలా తెలుసుకుంటారు. తులసీదాస్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ప్రతి ఎపిసోడ్ 5 నిమిషాలు ఉంటుంది. సీజన్ 1 మొత్తం 90 ఎపిసోడ్‌లుగా ఉంటుంది. YouTube, Facebook, Google Podcasts వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతుంది. అయితే సీజన్ 2 TVలో ప్రసారం కానుంది. భవిష్యత్తులో ఇది Metaverse, Web 3.0 వంటి అత్యాధునిక ప్లాట్‌ఫారమ్‌లలో ప్రదర్శించడానికి ప్రణాళికలు సైతం చేస్తున్నారు.
సిరీస్ ప్రొడ్యూసర్, ఎపిసోడ్ రీడర్‌గా కేవల్ కపూర్ వ్యవహరిస్తున్నారు. ఇది బహుశా ఈ విషయంపై చేసిన అతిపెద్ద ప్రయత్నమని కేవల్ కపూర్ తెలిపారు. దీపావళి రోజున ఈ సిరీస్‌ని ప్రజలకు అంకితం చేస్తున్నారు. దీని కోసం, పురాతన జ్ఞానం ఆధారంగా ఒక బలమైన స్క్రిప్ట్ రాసినట్లు తెలిపారు. ఇది నేటి యువతను ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు. నిరాశలో ఉన్న వారికి ఆశలు చిగురించేలా చేసే సిరీస్ ఇది. జ్ఞాన శక్తికి మించిన శక్తి ఏదీ లేదని చూపిస్తుంది. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అని మీరు విశ్వసిస్తే.. ప్రపంచంలో ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు. నేటి డిజిటల్ యుగంలో ఈ సిరీస్ విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందిస్తుంది.. అని కేవల్ కపూర్ తెలిపారు.
తులసీదాస్‌పై 1954లో బాలచంద్రహర్సుఖ్ దర్శకత్వం వహించిన క్లాసికల్ ఫీచర్ ఫిల్మ్ కూడా తీయబడిందని కేవల్ కపూర్ చెప్పారు. ఇందులో మహిపాల్, శ్యామ కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత 1972లో సంత్ తులసీదాస్‌పై భక్తిరస చిత్రం రూపొందించబడింది, అది విజయవంతమైంది. ఆల్ ఇండియా రేడియో కూడా శ్రీ రామ్ చరిత్ మానస్ గురించి ఒక అందమైన ధారావాహికను నడిపింది. అయితే ఇవన్నీ గతానికి సంబంధించిన విషయాలు.
తులసీదాస్‌పై 1954లో బాలచంద్రహర్సుఖ్ దర్శకత్వంలో క్లాసికల్ ఫీచర్ ఫిల్మ్ కూడా వచ్చినట్లు కేవల్ కపూర్ చెప్పారు. ఇందులో మహిపాల్, శ్యామ కీలక పాత్రలు పోషించారన్నారు. ఆ తర్వాత 1972లో సంత్ తులసీదాస్‌పై భక్తిరస చిత్రం రూపొందించినట్లు తెలిపారు. అది సూపర్ హిట్ అయినట్లు వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియో కూడా శ్రీ రామచరిత్ మానస్ గురించి ఒక అందమైన ధారావాహికను ప్రసారం చేసిందని తెలిపారు. అయితే ఇవన్నీ గతానికి సంబంధించిన విషయాలని.. కానీ ఇప్పుడు గోస్వామి తులసీదాస్ గురించి సరికొత్త విషయాలతో ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..