Sankarabharanam : శంకరాభరణం సినిమాలో ఛాన్స్ కోసం ఆ పెద్ద హీరోయిన్ చాలా ట్రై చేసింది.. కానీ మిస్సైంది..
ఒకప్పుడు థియేటర్లలో సంచలనం సృష్టించిన సినిమా శంకరాభరణం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించడమే కాకుండా సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్రలో పోషించిన సీనియర్ నటి మంజు భార్గవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా మంజు భార్గవి జీవితాన్ని ఎలా మార్చిందో వెల్లడించారు.

ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ శంకరాభరణం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ మంజు భార్గవి. ఈ సినిమాతో ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రస్థానం, ప్రత్యేకించి శంకరాభరణం అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమా ఆమె జీవితంలో ఒక మలుపు అని, తులసి పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరని ఆమె అన్నారు. శంకరాభరణం సబ్జెక్టును కె. విశ్వనాథ్ గారు సిద్ధం చేసుకున్నప్పుడు, ఈ చిత్రంలోని పాత్రలకు కొత్త నటీనటులు అయితే బాగుంటుందని ఆయన భావించారట. వాస్తవానికి, తులసి పాత్ర కోసం ప్రముఖ నటి జయప్రద కూడా తీవ్రంగా ప్రయత్నించారని మంజు భార్గవి వెల్లడించారు. అంతకుముందు జయప్రద సిరిసిరిమువ్వలో నటించినప్పటికీ, విశ్వనాథ్ గారు ఆమెను ఎంపిక చేయలేదని అన్నారు.
తాను చేసిన గత చిత్రాలైన ప్రెసిడెంట్ పెరమ్మ, గాలిపటాలు, ఎన్టీ రామారావు గారి యమగోలలో రంభ, ఊర్వశి, మేనక పాత్రలు, అనేక పౌరాణిక చిత్రాలలో పిచ్చి పిచ్చి డాన్స్‌లు, క్యారెక్టర్ల వల్ల విశ్వనాథ్ గారికి తన సామర్థ్యంపై అనుమానం ఉండేదని మంజు భార్గవి చెప్పారు. అందుకే ఆయన తనను మైండ్‌లో పెట్టుకొని ప్రెసిడెంట్ పెరమ్మలో ఒక చిన్న క్లాసికల్ డాన్స్ పాత్ర ఇచ్చి, తన కెపాసిటీని టెస్ట్ చేశారన్నారు. యమగోలలో రంభ పాత్రను మూడు భాషల్లో (తెలుగు, తమిళ్, హిందీ) తనే చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు. తరువాత విశ్వనాథ్ గారు మంజు భార్గవిని, సోమయాజులు గారిని మేకప్ టెస్ట్‌కు పిలిచారు. ఈ టెస్ట్‌ను కెమెరామెన్ బాలు మహేంద్ర గారి ఇంటి మేడ మీద నిర్వహించారు. టెస్ట్ వీడియోను పరిశ్రమకు చూపించినప్పుడు, ఎవ్వరూ తనను గుర్తించలేకపోయారని, దాంతో విశ్వనాథ్ గారు “తాను గేమ్ గెలిచాను” అని సంతోషించారని మంజు భార్గవి ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకులపై తన కొత్త రూపం ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ఆయన అనుమానాలు పటాపంచలయ్యాయని ఆమె వివరించారు.
సినిమా రంగం పట్ల మొదట్లో మంజు భార్గవికి అంతగా ఆసక్తి ఉండేది కాదట. “నాకు సినిమాలు అంటేనే ఇష్టం లేదు. సినిమా పరిశ్రమ ఒక ఎందుకు అనే ఆటిట్యూడ్ ఉండేది. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్‌ని, అటు ఇటు తిరిగేదాన్ని కాదు. నా మెంటాలిటీ వేరు” అని ఆమె పేర్కొన్నారు. అయితే, చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఆమెకు పిచ్చి. ఐదేళ్ల వయసు నుంచే అన్న అన్న విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు వంటి పాటలకు వేదికపై సోలో ప్రదర్శనలు ఇచ్చేవారు. కూచిపూడి మహారథి వేంపటి చిన్నసత్యం గారితో వారి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఆయన తన తండ్రికి చాలా క్లోజ్ అని ఆమె చెప్పారు. తాను పుట్టినప్పుడు ఆసుపత్రిలో తనను ఎత్తుకున్న తొలి వ్యక్తి వేంపటి చిన్నసత్యం గారేనని, ఈ అనుబంధం వల్లే ఆయన చెన్నైలోని తన స్కూల్‌లో డాన్స్ నేర్చుకున్నానని తెలిపారు. “శంకరాభరణం వంటి సినిమాలో డైలాగులు లేకుండానే కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో నటించగలిగానంటే, దానికి కారణం నేను ఒక డాన్సర్ కావడమే. డాన్స్ వల్లే సులువుగా నటిగా మారగలిగాను, ముఖ్యంగా కూచిపూడి” అని ఆమె చెప్పారు. శంకరాభరణం తర్వాత తన జీవితం మొత్తం మారిపోయిందని, అది తనను తెలుగు ప్రజలకు దగ్గర చేసిందని మంజు భార్గవి గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
శంకరాభరణం సినిమా, జయప్రద..

Sankarabharanam, Jayaprada
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
