AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

waltair veerayya: విశాఖ బీచ్‌లో చిరు ఫ్యాన్స్ హంగామా.. వాల్తేరు వీరయ్య గెటప్‌లో సందడి చేసిన అమ్మాయిలు, అబ్బాయిలు

రేపు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక బీచ్‌ నుంచి మరో ప్లేస్‌కి షిఫ్ట్‌ అయ్యింది

waltair veerayya: విశాఖ బీచ్‌లో చిరు ఫ్యాన్స్ హంగామా.. వాల్తేరు వీరయ్య గెటప్‌లో సందడి చేసిన అమ్మాయిలు, అబ్బాయిలు
Chiru Gans At Visakha Beach
Surya Kala
|

Updated on: Jan 07, 2023 | 10:47 AM

Share

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో  ఓ వైపు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది.. మరోవైపు మెగా ఫ్యాన్స్ చిరు పై తమ అభిమానాన్ని చాటుతూ సినిమా ప్రమోషన్ ను తమదైన శైలిలో చేస్తున్నారు. తాజాగా విశాఖ బీచ్‌లో వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్‌ వాక్‌ జరిగింది. వాల్తేరు వీరయ్య గెటప్‌లో సందడి చేశారు అమ్మాయిలు, అబ్బాయిలు. ఈ రోజు ట్రైలర్ ను రిలీజ్ చేయనుండగా.. రేపు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక బీచ్‌ నుంచి మరో ప్లేస్‌కి షిఫ్ట్‌ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే..

మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్‌ జోరుగా సాగుతోంది. విశాఖ బీచ్‌ రోడ్‌లో ప్రమోషన్‌ ర్యాలీ నిర్వహించారు మెగా ఫ్యాన్స్‌. వాల్తేరు వీరయ్య గెటప్‌లో లుంగీ, షర్ట్‌, కళ్లద్దాలు ధరించి బీచ్‌ రోడ్‌లో వాక్‌ చేశారు అభిమానులు. అమ్మాయిలు, అబ్బాయిలతోపాటు చిన్నపిల్లలు కూడా వాల్తేరు వీరయ్య గెటప్‌లో ఆకట్టుకున్నారు. విశాఖ వేదికగా రేపే వాల్తేరు వీరయ్య మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతోంది. మెగా ఈవెంట్‌ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయ్‌. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు మెగా అభిమానులు. అయితే, బీచ్‌ రోడ్‌ నుంచి వేదికను మార్చుకోవాలని పోలీసులు సూచించడంతో, ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌కి షిఫ్ట్‌ చేశారు నిర్వాహకులు.దీంతో మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా నిర్ణయించినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 8న సాయంత్రం 5 గంటలకు విశాఖలోని ఆర్కే బీచ్‏లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరు రవితేజలు కలిపి నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే