Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: రజనీకాంత్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరోయిన్.. ప్రొడ్యూసర్ రాకతో సీన్ రివర్స్

సినీ ప్రపంచంలో ప్రేమ కథలకు కొదువ లేదు. కొన్ని ప్రేమలు పెళ్లి పీటల వరకు వెళ్తే మరికొన్ని కనీసం పెదవి దాటకుండానే ముగిసిపోయాయి. అలాంటి ఎన్నో స్టోరీలు మీరు ఇప్పటి వరకు వినే ఉంటారు. అయితే, సినీ ఇండస్ట్రీని ఓ దశలో ఉలికిపాటుకి గురిచేసిన రూమర్ ఇది. అప్పటికే పెళ్లైన ఓ స్టార్ హీరో.. నిండా పాతికేళ్లు లేని మరో స్టార్ హీరోయిన్. వీరిద్దరి మధ్య మూగప్రేమ గురించి అప్పట్లో ఎంతో మంది కథలుకథలుగా చెప్పుకున్నారు..

Rajinikanth: రజనీకాంత్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరోయిన్.. ప్రొడ్యూసర్ రాకతో సీన్ రివర్స్
Rajanikanth Secret Love Story With Star Heroin
Follow us
Bhavani

|

Updated on: Mar 25, 2025 | 8:54 PM

ఆమె అప్పటికే కుర్రకారుకు ఓ కలల రాణి.. చిన్న వయసులోనే సినీ ఎంట్రీ ఇచ్చి దిగ్గజ హీరోలందరితో నటించేసి తిరుగులేని ఫామ్ లో ఉంది. ఇక అప్పటికే సూపర్ స్టార్ గా, తమిళుల ఆరాధ్య దైవంగా మారిపోయాడా హీరో. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, వీరి ప్రేమ పెళ్లి పీటలదాకా వెళ్లకుండానే మిగిలిపోయింది. ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు.. తమిళుల తలైవా రజనీకాంత్. అతడిని సీక్రెట్ గా ఆరాధించిన నటీమణి అతిలోక సుందరి శ్రీదేవి. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ అప్పటి మీడియాలో కోకొల్లలుగా వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ, ఓ ప్రొడ్యూసర్ ఎంట్రీ వీరి కధను మలుపు తిప్పింది. అతడే బోణీకపూర్. అసలింతకీ వీరి మధ్య ఏం జరిగిందనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

పద్మ పురస్కారాలన్నీ ఒంటి చేత్తో ఒడిసిపట్టిన ఈ హీరో రజనీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. బిల్లాతో స్టార్ గా ఎదిగి ముత్తు వడయప్పలాంటి ఎన్నో సూపర్ హిట్స్ తో ఓ వెలుగు వెలుగుతున్నాడు. అతడి దెబ్బకు బాక్సాఫీసులు షేక్ అవుతున్నాయి. మరోవైపు శ్రీదేవి పేరు ఇండస్ట్రీలో మార్మోగుతోంది. ఆమె సినిమా ఒప్పుకుంటే చాలనుకుని నిర్మాతలు ఆమె ఆఫీసు ముందు బారులు తీరుతున్న రోజులవి.

ఒకప్పుడు శ్రీదేవిని రజినీ ఎంతో ప్రేమించాడని కథనాలు వచ్చాయి. శ్రీ దేవికి కూడా అతడంటే ఎంతో ఇష్టమట. అయితే, అప్పటికే రజనీకాంత్ లతను పెళ్లి చేసుకున్నారు. ఇక కొన్ని పత్రికలైతే ఓ అడుగు ముందుకేసి శ్రీదేవిని రజనీ సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నాడని కూడా రాసేశాయి. ఇక ఈ విషయం అతని భార్య చెవిన పడిందట.

ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ శ్రీ దేవి సౌత్ లో సినిమాలకు దూరమైంది. ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఓ సెన్సేషన్. అప్పటికే శ్రీ దేవి అమ్మగారికి నిర్మాత బోణీ కపూర్ మంచి సన్నిహితుడు. ఓ సమయంలో తల్లి అనారోగ్యం శ్రీదేవిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఆ సమయంలోనే బోణీ కపూర్ ఆమెకు దగ్గరయ్యాడని చెప్తారు. ఇక వీరిద్దరి మధ్య సంబంధం పెళ్లివరకు వెళ్లింది.

వీరి పెళ్లి, జాన్వీ కపూర్ జననం.. సినీ పరిశ్రమలో ఎంత పెద్ద సంచలనమో తెలిసిందే. బోణీ కపూర్ ను రెండో పెళ్లి చేసుకున్న శ్రీదేవి పూర్తిగా ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. ఇక ఆ తర్వాత ఈ సూపర్ స్టార్, శ్రీ దేవిల స్టోరీని అంతా మర్చిపోయారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, ఒకప్పుడు ఈ వీరిపై వచ్చిన వార్తలు ఓ ఊపు ఊపాయి. ఆ తర్వాత అంతా మామూలే. అయితే, వీరిద్దరూ తమ ప్రేమను చివరి వరకూ ఒకరికొకరు చెప్పుకోలేకపోయారట.