ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోన్న రాజమౌళి.. నెటిజన్ల రిక్వెస్ట్‌కు జక్కన్న మాటేంటి..!
దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నారు. రాజమౌళి.. రాజమౌళి అంటూ నెటిజన్లు ఆయనకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నారు. రాజమౌళి.. రాజమౌళి అంటూ నెటిజన్లు ఆయనకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. అందులో ఉత్తరాది వారే ఎక్కువగా ఉన్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మన జక్కన్న ట్రెండ్ అవ్వడానికి కారణమేంటి..? నెటిజన్లు ఆయనకు చేస్తోన్న రిక్వెస్ట్ ఏంటి అనుకుంటున్నారా..!
రామనంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణ్’ ఇటీవల డీడీలో పునః ప్రసారం కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్ రికార్డు క్రియేట్ చేసింది. 77మిలియన్ వ్యూయర్స్‌తో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను బీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామాయణ్‌ను రాజమౌళి తెరకెక్కించాలని నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. తన విజువల్స్‌తో ఇప్పటి తరానికి తగ్గట్లుగా రాజమౌళి మాత్రమే అద్భుతంగా ‘రామాయణ్’ను తెరకెక్కించగలరని వారు కామెంట్లు పెడుతున్నారు. మరి వారి రిక్వెస్ట్‌కు జక్కన్న ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే పలుమార్లు రాజమౌళి ప్రకటించారు. ఈ సినిమాను తాను కచ్చితంగా తెరకెక్కిస్తానని ఆయన అన్నారు. కాగా ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తరువాత మహేష్ బాబుతో ఓ మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మహా భారతం కూడా ఇప్పట్లో తెరకెక్కడం కష్టమే. ఇదిలా ఉంటే ఓ పది సంవత్సరాల తరువాత తాను రిటైర్మెంట్ తీసుకుంటానని రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.
Read This Story Also: Corona: హైదరాబాద్‌లోని ఆ ప్రాంతంలో వారం పాటు అన్నీ బంద్..!