ఇట్స్ కరోనా టైమ్: ‘స్పైడర్ మ్యాన్’ అయినా సరే మాస్క్ పెట్టాల్సిందే
మాయదారి కరోనా మహమ్మారి రాకతో మన జీవితంలో మాస్క్‌లు కూడా ఒక భాగమయ్యాయి. కరోనా రాకుండా ఉండేందుకు, వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు
Spider Man Mask: మాయదారి కరోనా మహమ్మారి రాకతో మన జీవితంలో మాస్క్‌లు కూడా ఒక భాగమయ్యాయి. కరోనా రాకుండా ఉండేందుకు, వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు మాస్క్ ధరించాలని శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. దీంతో బయటకు వెళ్లే సమయంలో అందరికీ మాస్క్ ప్రధాన ఆయుధంగా మారింది. ఇదిలా ఉంటే మాస్క్ వాడకంపై కొంతమంది ప్రముఖులు సందర్భం వచ్చినప్పుడు అవగాహనను కలిగిస్తున్నారు. ( సామ్ జామ్: సమంత భారీ కటౌట్ రివీల్)
తాజాగా హాలీవుడ్ నటుడు, స్పైడర్ మ్యాన్ పాత్రాధారి టామ్ హోలెండ్ సెట్స్‌లో మాస్క్ ధరించాడు. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ 3 షూటింగ్ జరుగుతుండగా.. అందులో స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్‌తో మాస్క్‌ని పెట్టుకొని ఫొటోకు ఫోజ్ ఇచ్చాడు. ఇక ఈ ఫొటోకు మాస్క్‌ని ధరించండి. నేను రెండు ధరించా అని కామెంట్ పెట్టారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది డిసెంబర్ 17న విడుదల కానుంది. ( కామాఖ్యాదేవికి 20కిలోల బంగారం విరాళమిచ్చిన అంబానీ)
https://www.instagram.com/p/CHQpnd2FYRy/?utm_source=ig_embed