సామ్ జామ్: సమంత భారీ కటౌట్ రివీల్
ఇటీవలే బిగ్‌బాస్ షోతో వ్యాఖ్యతగా మారిన అక్కినేని కోడలు సమంత.. ఇప్పుడు ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారేందుకు సిద్ధమవుతోంది.
Samantha Sam Jam: ఇటీవలే బిగ్‌బాస్ షోతో వ్యాఖ్యతగా మారిన అక్కినేని కోడలు సమంత.. ఇప్పుడు ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో సామ్‌జామ్ పేరుతో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసేందుకు ఆమె రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్ ఈ నెల 13న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది ఆహా టీమ్. ( కామాఖ్యాదేవికి 20కిలోల బంగారం విరాళమిచ్చిన అంబానీ)
ఇందులో భాగంగా ఇప్పటికే మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన ఆహా టీమ్. తాజాగా భారీ కటౌట్‌ని లాంచ్ చేసింది. అల్లు అరవింద్, సమంత సమక్షంలో లాంచ్ అయిన ఈ కటౌట్ వీడియోను ఆహా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆహాలోని బిగ్గెస్ట్ షోకు సంబంధించిన బిగ్గెస్ట్ పోస్టర్ రివీల్ చేశాము. సమంత శామ్‌జామ్‌కి రెడీగా ఉండండి. నవంబర్ 13 నుంచి ఈ కార్యక్రమం ప్రదర్శితం కానుంది. ఇక ఈ వీడియోకు స్పందించిన సమంత.. స్టార్‌లకు ఈగో ఎందుకు ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు అని కామెంట్ పెట్టారు. కాగా ఈ షోలో చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సైనా నెహ్వాల్, తమన్నా తదితరులను సమంత ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ( నేను పార్టీ మారడం లేదు: రామ సుబ్బారెడ్డి)
And you wonder why stars have big egos ??… ❤️ Thankyou @ahavideoIN https://t.co/VQ4ZgkTgrR
— Samantha Akkineni (@Samanthaprabhu2) November 7, 2020