నేను పార్టీ మారడం లేదు: రామ సుబ్బారెడ్డి
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి, వైసీపీ నేత రామసుబ్బారెడ్డి అన్నారు. శనివారం మాట్లాడిన ఆయన

Rama Subba Reddy: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి, వైసీపీ నేత రామసుబ్బారెడ్డి అన్నారు. శనివారం మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ నాయకత్వంపై విశ్వాసంతోనే వైసీపీలో చేరానని అన్నారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైసీపీలో ఉంటానని తెలిపారు. పార్టీలోని అందరూ తనను గౌరవిస్తున్నారని వెల్లడించారు. వైసీపీ కోసం ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారని, ఇకపై కూడా అందరం కలిసి పనిచేస్తామని వివరించారు. పార్టీ మారే అవసరం లేదని, రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటనే ఉంటానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Read More:
హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు వచ్చే అవకాశం..!