AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బొగ్గు గనిపై సమీక్ష

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరారు. మార్చి 10 నుంచి 11 వరకు ఛత్తీస్‌గఢ్‌‌లో పర్యటిస్తారు. అక్కడ ప్రపంచంలోని 2వ అతిపెద్ద బొగ్గు గని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) పరిధిలోని గెవ్రాలో కార్యకలాపాలను సమీక్షిస్తారు.

ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బొగ్గు గనిపై సమీక్ష
G Kishan Reddy
Balaraju Goud
|

Updated on: Apr 09, 2025 | 6:39 PM

Share

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరారు. మార్చి 10 నుంచి 11 వరకు ఛత్తీస్‌గఢ్‌‌లో పర్యటిస్తారు. అక్కడ ప్రపంచంలోని 2వ అతిపెద్ద బొగ్గు గని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) పరిధిలోని గెవ్రాలో కార్యకలాపాలను సమీక్షిస్తారు. ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాళ్లను సాధించడంలో కీలకపాత్ర పోషించిన గని కార్మికులతో సహా మైనింగ్ పర్యావరణ వ్యవస్థలోని వాటాదారులతో కేంద్ర మంత్రి సమావేశమవుతారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడంలో కోల్ మైనింగ్ కుటుంబం చేసిన కృషిని ఆయన ప్రశసిస్తారు. పరిశ్రమల వాటాదారులతో పాటు, మైనింగ్ రంగానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చర్చిస్తారు. రెండు రోజుల పర్యటలో భాగంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అవుతారు.

భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఇండియా లిమిటెడ్ (SECL) మెగా ప్రాజెక్ట్ గెవ్రా గని త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిగా మారనుంది. ఇది ఏటా ఒక బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి పర్యావరణ అనుమతి పొందింది. దీని తరువాత, SECL యాజమాన్యం గని విస్తరణకు వేగంగా కృషి చేస్తోంది.

తాజాగా ఒక బిలియన్ టన్నుల ఉత్పత్తితో కొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం, ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గని యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన బ్లాక్ థండర్ మైండ్‌ నిలిచింది. కానీ ఇప్పుడు త్వరలో ఈ గని ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గని అనే అర్హతను కోల్పోతుంది. ఈ రికార్డు కోర్బా జిల్లాలో ఉన్న గెవ్రా కోల్ మైన్స్ పేరు మీద నమోదు చేసుకోనుంది.

1981 లో గెవ్రా గని నుండి మొదటిసారిగా బొగ్గు తవ్వకం ప్రారంభమైంది. గత 43 సంవత్సరాలుగా దేశ ఇంధన అవసరాలను తీరుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గెవ్రా 50 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును తవ్వడం ద్వారా దేశంలోనే అతిపెద్ద బొగ్గు గనిగా అవతరించింది. 2023-24 సంవత్సరంలో 59 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తితో, ఇది ఇప్పుడు ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బొగ్గు గనుల జాబితాలో చేర్చింది. ప్రపంచంలోని అత్యంత ఆధునిక యంత్రాలను ఉపయోగించి గెవ్రాలో బొగ్గు తవ్వకం జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..