AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : సినిమా ఆడకపోతే అమీర్ పేట సెంటర్‏లో నిలబడి గుండు గీయించుకుంటా.. యంగ్ హీరోయిన్ ఛాలెంజ్..

ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు స్టార్ హీరోహీరోయిన్లు, గ్లామరస్ పాటలు అవసరం. అయితే తాజాగా యంగ్ హీరోయిన్ శ్వేతా లక్ష్మన్ తన సహా చిత్రంపై అనూహ్యమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పెద్ద బడ్జెట్ లేకపోయినా, కథపై పూర్తి నమ్మకంతో సినిమా రూపొందిందని తెలిపారు. ప్రేక్షకులు నిరాశపడితే అమీర్ పేట్ సెంటర్ లో గుండు గీసుకుంటానని ఆమె చేసిన ఛాలెంజ్ సినిమాపై ఆమెకున్న ధీమాకు నిదర్శనం. ఈ చిత్రం లవ్, పెయిన్, సాక్రిఫైస్ వంటి ఎమోషన్స్‌ను అందంగా చూపుతుందని ఆమె పేర్కొన్నారు.

Tollywood : సినిమా ఆడకపోతే అమీర్ పేట సెంటర్‏లో నిలబడి గుండు గీయించుకుంటా.. యంగ్ హీరోయిన్ ఛాలెంజ్..
Swetha Lakshman
Rajitha Chanti
|

Updated on: Aug 28, 2026 | 8:05 AM

Share

సెప్టెంబర్ 4న విడుదల కానున్న చిన్న సినిమాలలో ‘సహ: లైఫ్‌ ఆఫ్‌ సంజు’ ఒకటి. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగ్గా.. ఈ వేడుకకు నిర్మాత బన్నీ వాసు హాజరయ్యారు. అయితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ శ్వేతా లక్ష్మన్ స్పీచ్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే, వంశీ నందిపాటి, బన్నీ వాస్ వంటి ప్రముఖులు మద్దతు ఇస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రొడ్యూసర్ తేజ వెల్పుచర్ల, డైరెక్టర్ నిశాంత్ దోటి, హీరో కుమార్ కాసరం సహా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమా ప్రస్థానం గురించి మాట్లాడుతూ, తమ వద్ద పెద్ద బడ్జెట్ లేదా పెద్ద స్టార్ కాస్ట్ లేకపోవచ్చని, కానీ తమకున్న ఒకే ఒక్క బలం కథపై తమకున్న నమ్మకమని శ్వేతా లక్ష్మన్ వెల్లడించారు. ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ సినిమా ఒక లవ్ స్టోరీగా మాత్రమే కాకుండా, మన జీవితంలో జరిగి, జరుగుతున్న, జరగబోయే లేదా జరగకూడదనుకున్న ఎమోషన్స్ అన్నింటినీ ప్రతిబింబిస్తుందని ఆమె అన్నారు. లవ్ అంటే కేవలం ప్రేమ గీతాలు లేదా మాంటేజెస్ మాత్రమే కాదని, అందులో పెయిన్, సాక్రిఫైస్, లోతైన ఎమోషన్స్ కూడా ఉంటాయని ఆమె వివరించారు. కొన్నిసార్లు మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని, అలాంటి ఎమోషన్స్‌ను తమ సినిమాలో చాలా అందంగా చూపించామని శ్వేతా లక్ష్మన్ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

ప్రేక్షకులకు కేవలం విజ్ఞప్తి చేయడం లేదని, ఛాలెంజ్ చేస్తున్నానని శ్వేతా లక్ష్మన్ ధీమాగా చెప్పారు. “ఈ సినిమా చూసిన తర్వాత, మీరందరూ ఎంత మంచి సినిమా తీశారు రా వీళ్లు అని అనుకుంటారు. థియేటర్ల నుండి బయటికి వచ్చినప్పుడు అస్సలు ఎవరూ డిసప్పాయింట్ అవ్వరు. ఒకవేళ డిసప్పాయింట్ అయితే, గుర్తుపెట్టుకోండి, నేను అమీర్ పేట్ సెంటర్ లో నించుని గుండు గీసుకుంటాను. అంత స్ట్రాంగ్ కంటెంట్ తీశాం మేము” అంటూ శపథం చేసింది. దీంతో ఆమె మాటలు ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారని విన్నానని, అందుకే తాము బలమైన కంటెంట్‌తో, మంచి థియేటర్లలో, సరసమైన ధరల్లో సినిమాను అందిస్తున్నామని ఆమె తెలిపారు. సహా కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, 50 నుండి 60 మంది కొత్తవారి జీవితం, వారి హార్డ్ వర్క్, డెడికేషన్, ప్యాషన్, డ్రీమ్ అని శ్వేతా లక్ష్మన్ వివరించారు. ఇదంతా కలిస్తేనే సహా లైఫ్ ఆఫ్ సంజుగా రూపుదిద్దుకుందని ఆమె అన్నారు. నిశాంత్ దోటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. కుమార్ కాసరం, శ్వేతా లక్ష్మన్, ప్రజానా పాండ్య తదితరులు నటించారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వెల్పుచర్ల నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

సహా మూవీ ట్రైలర్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

Follow Us