Varudu Kaavalenu: నాగశౌర్య ‘వరుడు కావలెను’ ట్రైలర్ లాంచ్ చేసిన దగ్గుబాటి హీరో..

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన శౌర్య ఆయా సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

Varudu Kaavalenu: నాగశౌర్య 'వరుడు కావలెను' ట్రైలర్ లాంచ్ చేసిన దగ్గుబాటి హీరో..
Varudu Kavalenu
Follow us

|

Updated on: Oct 21, 2021 | 8:27 PM

Varudu Kaavalenu: యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన శౌర్య ఆయా సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సంతోష్ జాగర్ల ముడి దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్య అనే సినిమాను కంప్లీట్ చేశాడు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఈ క్రమంలోనే శౌర్య నటించిన వరుడు కావలెను సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. ఈ  సినిమాకు లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది.

వరుడు కావలెను సినిమాలో తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ట్రైలర్ ను దగ్గుబాటి హీరో రానా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన రానా చిత్రయూనిట్ కు అబినందలను తెలిపారు. సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుందని రానా అన్నారు. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కెయండి.