Pawan Kalyan: మనల్ని ఎవడ్రా ఆపేది.. వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్.. ఎందులో అంటే

|

Dec 19, 2024 | 5:12 PM

2024లో పవన్ కళ్యాణ్ సృష్టించిన సంచలనం అంతా.. ఇంతా కాదు. ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపారు పవన్. ఎన్నికల సమయంలో ఆయన ప్రచారాలు, సభలు, మాటలు అబ్బో.. అప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించింది ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీబాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan: మనల్ని ఎవడ్రా ఆపేది.. వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్.. ఎందులో అంటే
Pawankalyan
Follow us on

2024 ముగింపుకు వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025కు వెల్కమ్ చెప్పబోతున్నాం. కాగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో వింతలు, విశేషాలు జరిగాయి. కొత్త తారలు పుట్టుకొచ్చారు. కొంతమంది విడాకులు తీసుకున్నారు. మరికొంతమంది పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇంకొంతమంది అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు. ఇలా చాలా చిత్రాలు జరిగాయి. కాగా ఇప్పుడు ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటులు, నటీమణుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. విశేషమేమిటంటే.. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో హీరో టాలీవుడ్ టాప్ 2లో ఉన్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గూగుల్ విడుదల చేసిన జాబితాలో ఈ ఏడాది ఎక్కువ మంది సర్చ్ చేసిన నటుల్లో పవన్ రెండో స్థానంలో నిలిచారు.

ఇది కూడా చదవండి : సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు

హాలీవుడ్ నటుడు కేట్ విలియమ్స్ ప్రపంచంలో అత్యధికంగా సర్చ్ చేసిన నటులలో నంబర్ వన్ గా ఉన్నాడు. ఇక రెండో స్థానంలో నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. విశేషమేమిటంటే 2024లో పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయినప్పటికీ, ఆయన  పాపులారిటీ తగ్గలేదు అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే.

ఇది కూడా చదవండి : Akhil: అయ్యగారికి జోడీ దొరికేసింది.. అఖిల్ నెస్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనట

జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశారు. ఎన్నికల వరకు రోజూ వార్తల్లో నిలిచారు పవన్ కళ్యాణ్.. ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచి ఆంధ్రప్రదేశ్ డీసీఎం అయ్యి మళ్లీ వార్తల్లో నిలిచారు. దాంతో  చాలా మంది గూగుల్‌లో పవన్ కళ్యాణ్ గురించి రెగ్యులర్‌గా సెర్చ్ చేశారు, ఇప్పుడు ఆ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్ రెండవ స్థానంలో ఉన్నారు. గ్లోబల్ లిస్ట్‌లో మరో ఇద్దరు భారతీయ నటీమణులు ఉన్నారు. ఈ జాబితాలో నటి హీనా ఖాన్ పేరు ఐదో స్థానంలో ఉంది. హినా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. దాంతో ఆమె ఇటీవల వార్తల్లో నిలిచారు. దస్వీ’, ‘ఎయిర్‌లిఫ్ట్‌’ సహా పలు సినిమాల్లో నటించిన నిమ్రత్ కౌర్ కూడా అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని, ఈ విడాకులకు నిమ్రత్ కౌర్ కారణమని పుకార్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.