Toxic Movie: ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన యశ్‌.. ట్యాక్సిక్ గురించి ఏమన్నాడంటే?

యశ్ నటిస్తోన్న 'టాక్సిక్'ని ఏప్రిల్ 10, 2025న విడుదల చేస్తామని టీమ్ పేర్కొంది. కానీ, భారీ బడ్జెట్ సినిమాల్లో అనుకున్న తేదీకి సినిమా విడుదల కావడం లేదు. ఒకటి రెండు సార్లు రిలీజ్ వాయిదా వేసిన తర్వాతే సినిమా విడుదల అవుతుంది. 'పుష్ప 2', 'కల్కి 2898 ఇలా చాలా సినిమాలు పలుసార్లు వాయిదా పడ్డకే రిలీజయ్యాయి . ఇప్పుడు ఈ వరుసలో 'టాక్సిక్' కూడా చేరుతోంది.

Toxic Movie: ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన యశ్‌.. ట్యాక్సిక్ గురించి ఏమన్నాడంటే?
Toxic Movie
Follow us

|

Updated on: Oct 23, 2024 | 3:15 PM

కేజీఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025 ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ తేదీకి కూడా సినిమా రిలీజ్ కావడం కష్టమంటున్నాడు. సినిమా విడుదల కచ్చితంగా వాయిదా పడుతుందని రూమర్లు వస్తున్నాయి. తాజాగా హీరో యశ్ కూడా దీనిపై ఓ క్లారిటీ ఇచ్చాడు. ‘సినిమా షూటింగ్‌ను కొంచెం ముందుగా ప్రారంభించాల్సి ఉంది. అయితే అది అనుకున్నంతగా జరగలేదు. తేదీ సమస్యగా మారింది. ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది. అనుకున్న తేదీకి రాలేం’ అని యవ్ చెప్పుకొచ్చాడు. ‘విశ్వసనీయత కీలకం. మేం డేట్ అనౌన్స్ చేసి రిలీజ్ చేయలేకపోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే మొదటిసారి. ఈ సినిమా రిలీజ్ విషయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం కాస్త కష్టమే’. దీనికి తోడు ఈ సినిమాలో భారీ తారాగణం ఉంటోంది’ అని యశ్ చెప్పుకొచ్చాడు.

యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. కన్నడ ‘కేవీఎన్’ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో పాటు ‘రామాయణం’ సినిమాతో కూడా బిజీగా ఉంటున్నాడు యశ్. కాగా ఈ సినిమాలో ఇప్పటికే చాలా మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నయనతార, కియారా అద్వానీ, కరీనాకపూర్ వంటి అందాల తారలు ఈ మూవీలో భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ ఆర్టిస్టులతో పాటు వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కొంత మంది విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. ‘టాక్సిక్’లో కొందరు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఉన్నారు. అలాగే ‘టాక్సిక్’ సినిమా కోసం కొన్ని విదేశీ సంస్థలు పనిచేస్తున్నాయి.  ‘డూన్’, ‘ఇంటర్‌స్టెల్లార్’ వంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు మరికొన్ని దిగ్గజ, ఆస్కార్ విన్నింగ్ సినిమాలకు వీఎఫ్‌ఎక్స్ అందించిన ‘డీఎన్‌ఈజీ’.. యష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ అందిస్తోంది. 1998లో ప్రారంభమైన ఈ బ్రిటీష్ ఆధారిత సంస్థ హాలీవుడ్‌లోని అనేక ఉత్తమ చిత్రాలకు VFX చేసింది. DNEG ఇప్పటివరకు 2000 కంటే ఎక్కువ సినిమాలకు పనిచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో