బాలీవుడ్ సీక్రెట్ బయట పెట్టిన సాయి పల్లవి.. 

Rajeev 

25 October 2024

 అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది కుర్రాళ్ల క్రష్ ఈ చిన్నది. 

సాయి పల్లవి 1992లో జన్మించింది. సాయి పల్లవి డాక్టర్ కావాలనుకుంది.. అలాగే ఈ ముద్దుగుమ్మకు డాన్స్ అంటే చాలా ఇష్టం. 

2015లో విడుదలైన 'ప్రేమమ్' సినిమాతో సాయి పల్లవి తన కలర్‌ఫుల్ కెరీర్‌ని ప్రారంభించింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. 

ఆతర్వాత ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, మారి, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ , విరాటపర్వం సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. 

ఇక ఇప్పుడు ఈ చిన్నది బాలీవుడ్ లోనూ అడుగుపెట్టనుంది. బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న రామాయణం సినిమాలో నటిస్తుంది. 

రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా.. సాయి పల్లవి సీతగా కనిపించనుంది. 

తాజాగా బాలీవుడ్ సీక్రెట్ బయట పెట్టింది సాయి పల్లవి. ఒక వ్యక్తి ఫోన్ చేశారు. మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి, ప్రతి రోజు వార్తల్లో ఉండటం కోసం పీఆర్ కావాలా అని అడిగారు.  

పీఆర్ ని పెట్టుకొని నన్ను నేను ప్రమోట్ చేసుకోను.. రోజూ వార్తల్లో నిలిస్తే జనాలకు బోర్ కొడుతుంది. అందుకే దాని పీఆర్ జోలికి వెళ్ళలేదు అని చెప్పింది పల్లవి.