AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rangamarthanda: ఆ ఒక్క మార్పు చేసుంటే ‘రంగమార్తాండ’ అద్భుతంగా ఉండేది: పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్..

తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూ ఇచ్చారు. ఇందులో అద్భుతమైన నటనతో ప్రేక్షుకులను కంటతడి పెట్టించిన బ్రహ్మానందం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమా చూశాక ఆయనకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు. దాదాపు 1250 సినిమాలు, ఎన్నో అవార్డ్స్ అందుకున్న బ్రహ్మానందంలో అద్భుతమైన నటుడిని రంగమర్తాండ సినిమాలోనే చూసినట్లు చెప్పారు.

Rangamarthanda: ఆ ఒక్క మార్పు చేసుంటే ‘రంగమార్తాండ’ అద్భుతంగా ఉండేది: పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్..
Paruchuri, Brahmanandam
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2023 | 3:55 PM

Share

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా రంగమార్తండ. చాలా కాలం గ్యాప్ తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుటుంది. ముఖ్యంగా ఉందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ మరోసారి తమ నటనతో ఆడియన్స్‏ను కంటతడి పెట్టించారు. ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సింప్లిగంజ్, అనసూయ, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా కీలకపాత్రలలో నటించారు. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూ ఇచ్చారు. ఇందులో అద్భుతమైన నటనతో ప్రేక్షుకులను కంటతడి పెట్టించిన బ్రహ్మానందం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సినిమా చూశాక ఆయనకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు. దాదాపు 1250 సినిమాలు, ఎన్నో అవార్డ్స్ అందుకున్న బ్రహ్మానందంలో అద్భుతమైన నటుడిని రంగమర్తాండ సినిమాలోనే చూసినట్లు చెప్పారు.

నిల్చొని, కూర్చొని డైలాగ్స్ చెబుతారని కానీ.. ఈ సినిమాలో బ్రహ్మానందం బెడ్ పై ఉండి పౌరాణిక డైలాగ్స్ అద్భుతంగా చెప్పారని ప్రశంసించారు. అలా చెప్పడం గొప్ప నటులకు తప్ప మిగిలిన వారికి సాధ్యం కాదని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఎవరైనా రంగమార్తాండ చూడకపోతే బ్రహ్మానందం కోసమైన చూడాలని కోరారు. ఇందులోని బ్రహ్మానందం నటన చూసి ఆశ్చర్యపోయానన్నారు. కానీ అంత అద్భుతమైన రంగస్థల నటుడు స్నేహితుడి వల్ల చనిపోవడం ఆయనకు నచ్చలేదని.. సినిమాలోని ఆ ఒక్క సన్నివేశం పై పరుచూరి నిరాశ వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

తనకు తెలిసినవారిలో కొందరు స్టేజ్ పై డైలాగ్ చెబుతూనే ప్రాణాలు కోల్పోయారని.. రంగమర్తాండ్ క్లైమాక్స్ లో బ్రహ్మానందం సన్నివేశాల్లో కాస్త మార్పు చేసి ఉంటే ఇంకా బాగుండేదని అన్నారు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటన.. కృష్ణవంశీ డైరెక్షన్ కోసం అందరూ చూడాలని అన్నారు. ప్రతి సినిమాలోని పాటలు, ఫైటింగ్స్, డైలాగ్స్ అన్నీ ఉంటాయని.. కానీ ఈ సినిమాలో జీవితముందని అన్నారు. ప్రతి పాత్రలో జీవం ఉందని.. సినిమా చూసి అందరూ బ్రహ్మానందాన్ని ఆశీర్వదించాలని కోరారు. ప్రేక్షకులను నవ్వించడం కోసం ఇప్పటివరకు ఎన్నో వేషాలు వేసిన బ్రహ్మానందం.. ఈ సినిమాలో తన నటనను బయటకు తీశారన్నారంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.

Follow Us