
బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. భారీ హైప్ తో జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మొదటి రోజే రికార్డ్ స్తాయిలో కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఓవైపు ఈ సినిమా విమర్శకులు పర్శంసలు అందుకుంటుండగా.. మరోవైపు పలు సన్నివేశాలు.. డైలాగ్స్ విషయంలో మాత్రం ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో డైరెక్టర్ ఓంరౌత్ ను నెటిజన్స్ ఆడుకుంటున్నారు. ముఖ్యంగా రావణగా సైఫ్ లుక్స్, గ్రాఫిక్స్ విషయంలో ఓంరౌత్ పై విమర్శలు వస్తున్నాయి. ఇక అలాగే ఈ సినిమాలో హనుమ చెప్పిన డైలాగ్ పట్ల సినీప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడు చెప్పిన డైలాగ్ పై ఇప్పుడు నెట్టింట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సీతమ్మను వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో మంట పెడతారు. ఆ సమయంలో ఇంద్రజిత్తుతో హనుమ చెప్పే డైలాగ్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ వివాదం పై క్లారిటీ ఇచ్చారు డైలాగ్ రచయిత మనోజ్ ముంతషీర్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ ముంతషీర్ మాట్లాడుతూ… “ఇది పొరపాటుగా రాయలేదు. ఎంతో నిశితంగా ఆలోచించి హనుమంతుడి పాత్రకు డైలాగ్స్ రాశాను. సినిమాలోని చాలా పాత్రలు ఉన్నాయి. అందులో అందరూ ఒకేలా మాట్లాడారు. పాత్రల మధ్య వైవిధ్యం చూపించాలనే హనుమ భాషను సింపుల్ గా ఉండేలా చూసుకున్నాను. లంకా దహనం సమయంలో హనుమ చెప్పే డైలాగ్ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రామాయణం గురించి మనకు తెలుసు ?.. చిన్నప్పటి నుంచి కథలు కథలుగా చెప్తేనే కాదా మనకు తెలిసింది. రామాయణంపై ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. నాకు మా అమ్మమ్మ, నానమ్మ రామాయణ కథలు చాలా సింపుల్ గా చెప్పేవారు. జానపద కళాకారులు కూడా హనుమ సంభాషణలను ఇలాగే చెప్పేవారు. దాన్నే నేను ఆదిపురుష్ సినిమా కోసం ఉపయోగించాను. అంతే తప్ప నేనేమి కొత్తగా డైలాగ్ సృష్టించలేదు ” అంటూ చెప్పుకొచ్చారు.