బాబోయ్ ఇది కదా అరాచకం అంటే..! ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారేంటీ..!!
మహేష్ బాబు, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. అన్నదమ్ములుగా వెంకటేష్, మహేష్ బాబు యాక్టివ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు లవర్ బాయ్‌గా కనిపిస్తాడు. మూవీలో ఈ చిన్నోడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ను సైలెంట్ గాచేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. రీసెంట్ గా మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ కలిసి నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఇందులోని సాంగ్స్ కూడా మంచి హిట్టయ్యాయి.
మహేష్ బాబు కామెడీ టైమింగ్.. వెంకీ యాక్టింగ్ అదిరిందనే చెప్పాలి. అన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో సమంత, అంజలి, అభినయ, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈసినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు మహేష్ బాబు, వెంకటేష్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు.
మార్చి 7న ( శుక్రవారం) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ అయ్యింది. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ రాజమౌళి సినిమాలో బిజీ అవ్వడంతో మహేష్ అభిమానులు ఆయన సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సీతమ్మ వాకిట్లో సినిమా రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా థియేటర్ లో ఓ లేడీ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ రేంజ్ లో డాన్స్ చేస్తున్నారంటే బాబు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram




