
మహోన్నతమైన వ్యక్తిత్వం, యెనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది.
ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కృషికి చలించిపోయిన చిరు, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేశ్వరి, మెగాస్టార్‌కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రధాన ఘట్టం చిరంజీవి తన మానవతా విలువలను చాటిన విధానం. రాజేశ్వరి పిల్లల విద్య కోసం, వారి భవిష్యత్ లో వెలుగునింపడం కోసం పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు చిరు. తన అభిమానులను కేవలం అభిమానులుగానే కాక, కుటుంబ సభ్యుల్లా చూసుకునే చిరంజీవి గొప్ప మనసుకు ఇది మరొక ఉదాహరణగా నిలిచింది. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చిరంజీవి మెగాస్టార్ అని చాటి చెప్పింది. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిరు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి.
వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.