Vijayashanti: మహేష్ తర్వాత ఆ స్టార్ హీరో సినిమాలో నటించనున్న లేడీ సూపర్ స్టార్
అలనాటి అందాల తారల్లో విజయశాంతి ఒకరు. హీరోలతో సరిసమానంగా యాక్షన్స్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు విజయశాంతి.. అప్పటి స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించారు విజయశాంతి.

అలనాటి అందాల తారల్లో విజయశాంతి(Vijayashanti)ఒకరు. హీరోలతో సరిసమానంగా యాక్షన్స్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు విజయశాంతి.. అప్పటి స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించారు విజయశాంతి. చాలా కాలం విజయశాంతి స్టార్ హీరోయిన్ గా రాణించారు. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా తన మాటలతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ లేడీ సూపర్ స్టార్. ఇక చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు విజయశాంతి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత విజయశాంతి సినిమాల్లో కంటిన్యూ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆమె తిరిగి రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అయితే ఇప్పుడు మరోస్టార్ హీరో సినిమాలో విజయశాంతి నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.
మహేష్ తర్వాత విజయశాంతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా తర్వాత కొరటాల తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. అటు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు తారక్. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది ఈ సినిమా తారక్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుందట.అలాగే తారక్ తో పాటు మరోపాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండనుందని దానికోసం విజయశాంతిని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కథ, పాత్ర నచ్చడంతో విజయశాంతి కూడా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.



