ఫ్యాన్స్ గెట్ రెడీ..! SSMB 29కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. ఆ రోజే ఫస్ట్ లుక్, టైటిల్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

ఫ్యాన్స్ గెట్ రెడీ..! SSMB 29కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. ఆ రోజే ఫస్ట్ లుక్, టైటిల్
Ssmb 29

Updated on: Oct 08, 2025 | 6:37 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ఆయన అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని టాక్. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ అనీ, ఇందులో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది.

ఇది కూడా చదవండి : Ramyakrishna: ఇలా ఎలా తల్లి..! రమ్యకృష్ణ నటనకు దండం పెట్టాల్సిందే..

ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా గ్లోబల్ బ్యూటీ  ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఏదైనా క్రేజీ అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు సినిమా ఫస్ట్ లు పోస్టర్ ను నవంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు పుట్టిన రోజున రాజమౌళి మహేష్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తా..! సంచలన కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్

ఇదిలా ఉంటే మహేష్ బాబు ఫిర్చ్ లుక్ పోస్టర్ అండ్ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం జక్కన్న పెద్ద ప్లానే వేశారు. ఓ గ్రాండ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారు. అవతార్ 3 సినిమా ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ చేతుల మీదుగా మహేష్ సినిమాను ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఇందుకోసం ఓ గ్రాండ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో రామోజీఫిలిమ్ సిటీలో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. నవంబర్‌ 16న ఈ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో వారణాసి సెట్ వేసి షూట్ చేశారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఈ ఈవెంట్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఓ స్టార్ హీరోకి కాబోయే భార్య.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.