
బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే 9 సీజన్స్ విజయవంతగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే 10వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష 2 కూడా త్వరలోనే ప్రారంభంకానుంది. బిగ్ బాస్ గేమ్ షోలో సెలబ్రెటీలు, సామాన్యులు కూడా పాల్గొంటున్నారు. గత సీజన్ లో అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులను సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించారు. ఈ సారి కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా కొందరు సామాన్యులను పంపించనున్నారు. త్వరలోనే అగ్నిపరీక్ష 2 మొదలు కానుంది. బిగ్ బాస్ లోకి వెళ్లాలనుకుంటున్న వారు అప్లికేషన్స్, అలాగే ఆడిషన్ వీడియోలు పంపించండి అంటూ ఇప్పటికే అనౌన్స్ చేశారు. దాంతో చాలా మంది తమ ఆడిషన్ వీడియోలు బిగ్ బాస్ టీమ్ కు పంపిస్తున్నారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి పలువురు సెలబ్రెటీలు ఎంట్రీ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కావొచ్చు. పదో సీజన్ కావడంతో ఈసారి హౌస్ లో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని తెలుస్తోంది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సారి చాలా స్పెషల్ ఉంటాయని తెలుస్తుంది. కంటెస్టెంట్ల ఎంపిక మొదలు గేమ్స్, టాస్కుల విషయంలోనూ చాలా కొత్త విధానాలను పరిచయం చేయనున్నట్లు తెలుస్తుంది.
ఇక నెట్టింట చక్కర్లు కొడుతున్న పేర్లు.. బుల్లితెర నటి పల్లవి గౌడ, తేజస్విని గౌడ, నందూస్ వరల్డ్ ఫేమ్ నందన, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, జబర్దస్త్ వర్ష, వర్షిణీ, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్, జబర్దస్త్ పవిత్రతో పాటు ఓ స్టార్ యాంకర్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు వింధ్య విశాఖ. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌లో యాంకర్ గా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది వింధ్య. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్స్ సమయంలో ఈ అమ్మడు చాలా పాపులర్ అయ్యింది. వింధ్య విశాఖ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ఈ అమ్మడికి భారీ రెమ్యునరేషన్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే వింధ్య విశాఖతో బిగ్ బాస్ టీమ్ సంప్రదింపులు జరుగుపుతున్నట్టు తెలిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి