AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR : థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే..! తారక్‌తో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ పడుతుందో అని అభిమానులు ఆందోళన పడ్డారు.

NTR : థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే..! తారక్‌తో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: May 08, 2025 | 6:54 PM

మ్యాన్ ఆఫ్ మిసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో పాటు డ్రాగన్ సినిమాల షూటింగ్స్ తో బిజీగాఉన్నాడు. ఇటీవలే దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తారక్ , ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2 లో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలు పెట్టారు.

ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ క్రేజీ బ్యూటీ తారక్ తో కలిసి స్టెప్పులేయనుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు. క్రేజీ బ్యూటీ శ్రుతిహాసన్.

గతంలోనూ శ్రుతిహాసన్ స్పెషల్ సాంగ్స్ చేసింది. మహేష్ బాబు నటించిన ఆగడు సినిమాలో శ్రుతిహాసన్ స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. అలాగే హాయ్ నాన్న సినిమాలో నానితో కలిసి డాన్స్ చేసింది శ్రుతి. ఇక ఇప్పుడు తారక్ తో స్టెప్పులేయనుందని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సలార్ సినిమాలో శ్రుతికి డాన్స్ చేసే ఛాన్స్ రాలేదు. దాంతో ఇప్పుడు ప్రశాంత్ డ్రాగన్ సినిమాలో ఆమెకు స్పెషల్ సాంగ్ ఛాన్స్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది. మరి ఈవార్తలో వాస్తవం ఎంత అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.