NTR30: తారక్- కొరటాల శివ సినిమాలో కీలక పాత్రలో ఆ క్రేజీ హీరోయిన్..!!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ పేరు కూడా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అన్ని సూపర్ హిట్స్ సాధించడంతో కొరటాల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ పేరు కూడా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అన్ని సూపర్ హిట్స్ సాధించడంతో కొరటాల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ ఆతర్వాత మహేష్ తో శ్రీమంతుడు, భరత్ అనే నేను, తారక్ తో జనతా గ్యారేజ్ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాలు చేశారు. వీటిలో ఆచార్య సినిమా తప్ప మిగిలినవన్నీ మంచి హిట్స్ గా నిలిచాయి. మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. . భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్య బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇక ఇప్పుడు తారక్ తో సినిమా చేస్తున్నాడు కొరటాల. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
అయితే ఈ సినిమాను మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కొరటాల. ఇప్పటికే కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న కొరటాల.. తారక్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథలో మార్పులు కూడా చేశారని తెలుస్తోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు కొరటాల. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామల పేరులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా మరో హీరోయిన్ కీలక పాత్రలో నటించనుందని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం కన్నడ నటి రుషిక రాజ్ ను ఎంపిక చేసుకున్నట్టు టాక్. గత ఏడాది వచ్చిన ‘అశ్మీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ భామ. తారక్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..