బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. బిగ్ బాస్ కొత్త సీజన్ వస్తుంది అంటేనే నెల ముందు నుంచి హడావిడి మొదలవుతుంది. ఈసారి హౌస్ లోకి ఎవరు వెళ్తారు.. ఎంత రెమ్యునరేషన్ తో వెళ్తారు అంటూ రకరకాల ఆ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఆ హీరో వెళ్తున్నాడు.. ఈ హీరోయిన్ వెళ్తుంది..? ఆ సీరియల్ యాక్టర్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ పదుల సంఖ్యలో పేర్లు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పటికే కొన్ని పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా బిగ్ బాస్ సీజన్ 8 కోసం నెటిజన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలుసు. సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఊహించని విధంగా విన్నర్ గా నిలిచాడు. సీరియల్ బ్యాచ్ ను దాటి పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం నిజంగా గ్రేట్.. ఇక ఇప్పుడు ఎవరు హౌస్ లోకి వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లే వారిలో చాలా వరకు మనకు తెలిసిన మొఖాలే ఉండనున్నాయి. ఇక నెట్టింట చక్కర్లు కొడుతున్న పేర్లలో.. కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, నిఖిల్(యాంకర్), కుమారీ ఆంటీ, బర్రెలక్క, అనీల్ గీలా(యూట్యూబర్), బుల్లెట్ భాస్కర్, బమ్ చిక్ బబ్లూ, వంశీ లతో పాటు రీతూ చౌదరి, సోనియా సింగ్, కుషితా కల్లపు, సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాక, వర్షిణి , నయన పావని, విష్ణు ప్రియా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో పేరు ఇప్పుడు లిస్ట్ లోకి వచ్చి చేరింది.
బిగ్ బాస్ సీజన్ 8కి ఒకప్పుడు అమ్మాయిలా రాకుమారుడు అబ్బాస్ కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. ఒకానొక సమయంలో అబ్బాస్ స్టార్ హీరోగా రాణించారు. ప్రేమ దేశం సినిమాతో అబ్బాస్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆతర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ కి ఫ్యాన్స్ ఉండేవారు. ఇక ఇప్పుడు అబ్బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అబ్బాస్. సింగపూర్ లో సెటిల్ అయ్యారు. ఇటీవలే ఆయన చెన్నైకు వచ్చారు. మరి నిజంగా అబ్బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతాడో లేదో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి