Bigg Boss Season 8: పెద్ద ప్లానే..! హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..
మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో .. సీజన్ 7 కూడా అదే రేంజ్‌లో టీఆర్పీ వచ్చింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం.. హౌస్ లోకి రాగానే రతికతో ప్రేమాయణం.. ఆతర్వాత టాస్క్ లలో కష్టపడి ఆడటం. అలాగే హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ తో గొడవలు ఇలా చాలా కంటెంట్ దొరికింది. అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా బాగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. ఈ గేమ్ షో కోసం ఇప్పటికే ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రేక్షకులకు బాగానే దగ్గరయింది. మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో .. సీజన్ 7 కూడా అదే రేంజ్‌లో టీఆర్పీ వచ్చింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం.. హౌస్ లోకి రాగానే రతికతో ప్రేమాయణం.. ఆతర్వాత టాస్క్ లలో కష్టపడి ఆడటం. అలాగే హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ తో గొడవలు ఇలా చాలా కంటెంట్ దొరికింది. అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ కూడా బాగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఫైనల్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఆ తర్వాత ఫినాలే రోజు జరిగిన రచ్చ మాములు రచ్చ కాదు.. అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ కొంతమంది రచ్చ చేశారు.
ఇది కూడా చదవండి : Krishna Vamsi: ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ
దాంతో పల్లవి ప్రశాంత్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత డ్రామా జరిగింది సీజన్ 7లో ఇక ఇప్పుడు సీజన్ 8 రెడీ అవుతుంది. రీసెంట్ గానే ఇందుకు సంబందించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు. ఆగస్టు లాస్ట్ లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8 మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఈ సారి హౌస్ లోకి ఎవరెవరు వెళ్తున్నారంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో హాట్ బ్యూటీల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ చిన్నదాని వీడియోలే.. ఇంతకూ ఈమె ఎవరంటే
ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర సీరియల్స్, యాంకర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వాటిలో.. కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, నిఖిల్(యాంకర్), కుమారీ ఆంటీ, బర్రెలక్క, అనీల్ గీలా(యూట్యూబర్), బుల్లెట్ భాస్కర్, బమ్ చిక్ బబ్లూ, వంశీ.. ఇక హౌస్ లోకి అడుగు పెట్టనున్న అందాల భామల విషయానికొస్తే .. రీతూ చౌదరి, సోనియా సింగ్, కుషితా కల్లపు, సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాక, వర్షిణి , నయన పావని పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరో హాట్ బ్యూటీ కూడా ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె విష్ణు ప్రియా. గతంలోనూ విష్ణు ప్రియకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందట.. కానీ ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆమె కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి రావాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో తన అందాలతో మతిపోగొడుతోన్న విష్ణు ప్రియా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందేమో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి