Ram Charan: జపాన్‌లో రిలీజ్ కానున్న రామ్ చరణ్ మరో బ్లాక్ బస్టర్ సినిమా
మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చరణ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన హిట్ సాధించడంతో పాటు జపాన్ లోనూ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

మెగా పవర్ స్టార్ కాస్త ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పేరు ఒక్కసారిగా పాన్ ఇండియా మొత్తం మారుమ్రోగింది. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చరణ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన హిట్ సాధించడంతో పాటు జపాన్ లోనూ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోవడంతో.. ఆయన నటించిన మరో సినిమాను కూడా జపాన్ లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.
సుకుమార్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా రంగస్థలం. ఈ సినిమా చరణ్ ను నటుడిగా మరో మెట్టు పైకెక్కించింది. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయి నటించారు. చెవిటివాడి పాత్రలో చరణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను జపాన్ భాషలో విడుదల చేయాలనీ చూస్తున్నారట. రంగస్థలం సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. దేవీశ్రీ ఈ సినిమాను సంగీతం అందించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా జపాన్ భాషలో విడుదల చేయనున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక చరణ్ ప్రస్తుతం ఆర్.సీ 15లో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
