Mahesh Babu: మహేష్ సినిమా కోసం ఆ స్టార్ హీరోయిన్‌ను ఫిక్స్ చేస్తోన్న జక్కన్న
రాజమౌళి- మహేష్ బాబు సినిమాకోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
రాజమౌళి- మహేష్ బాబు(Mahesh Babu) సినిమాకోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాలతర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది కూడా.. ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ తో జక్కన్న ఎలాంటి సినిమా తీయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే ఈ సినిమా కథ రెడీ అయ్యిందని తెలుస్తోంది. రాజమౌళి స్క్రిప్ట్ ను సిద్ధం చేసి నటీనటులను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారట జక్కన్న. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో సినిమా షూటింగ్ మొదలుపెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురించి రోజు ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో హీరోయిన్ పేరు ఇప్పుడు తెగ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మను ఎంపిక చేయాలని చూస్తున్నారట. మహేష్ సరసన ఈ సినిమాలో అందాల భామ దీపికా పదుకొనె ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కే సినిమాలో చేస్తోంది.ఇక మహేష్ , జక్కన్న సినిమాలో దీపికా ఫిక్స్ అయ్యిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..