Hyper Aadi : హైపర్ ఆది పై మండిపడుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే
జబర్ధస్ షో వల్ల చాలామంది పాపులర్ అయ్యిన విషయం తెలిసిందే. అలా క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. ఆ కామెడీ షోతో పాటు.. పలు సినిమాల్లోనూ నటించాడు ఆది.
జబర్ధస్ షో వల్ల చాలామంది పాపులర్ అయ్యిన విషయం తెలిసిందే. అలా క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో హైపర్ ఆది(Hyper Aadi )ఒకరు. ఆ కామెడీ షోతో పాటు.. పలు సినిమాల్లోనూ నటించాడు ఆది. తనదైన కామెడీతో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఇటీవల జబర్దస్త్ షోకి దూరంగా ఉన్న ఆది.. ఇటీవలే తిరిగి షోకు హాజరయ్యాడు. కామెడీ టైమింగ్ తో, తన పంచ్ లతో నవ్వించే ఆది పై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. స్కిట్ లో భాగంగా ఆది వేసిన సెటైర్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. పాన్ ఇండియా హిట్ గా నిలిచిన సినిమా పై ఆది చేసిన కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
స్కిట్ లో భాగంగా ఆది ఆర్ఆర్ఆర్ సినిమా పై సెటైర్లు వేశాడు. ఆర్ఆర్ఆర్ పై సెటైర్లు వేయడంతో తారక్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు జక్కన్న ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జక్కన్న, తారక్, చరణ్ ఎంతో కష్టపడ్డారు. సినిమా కూడా అదేరేంజ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఆస్కార్ అవార్డులు కూడా వస్తాయని హాలీవుడ్ మీడియానే అంటుంది. అలాంటి సినిమా పై ఆది సెటైర్లు వేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో మల్లి అనే చిన్న పాప కొమ్మ ఉయ్యాల అంటూ పాడే పాటతో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఆ పాప పాట పడకుండా ఉంటే ఇంత జరిగేది కాదు కదా అని సెటైర్లు వేశాడు ఆది. దాంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడిపై సెటైర్లు వేస్తావా అంటూ కామెంట్ చేస్తున్నారు. చరణ్, తారక్ ఫ్యాన్స్ హద్దులు దాటొద్దు అంటూ ఆది పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..