Sai Pallavi: మరోసారి ఆ స్టార్ హీరోకి జోడిగా సాయి పల్లవి.. మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తుంటారు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్, ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ మధ్య వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ అమ్మడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కు భిన్నంగా.. స్కిన్ షో కు దూరంగా ఉంటుంది సాయి పల్లవి. కేవలం నటనతోనే అభిమానులను సొంతం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మలయాళ సినిమా ప్రేమమ్ తో పరిచయమైనా సాయి పల్లవి ఆతర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది. ఇక తెలుగులో చివరిగా విరాటపర్వం సినిమా చేసింది.ఆ అలాగే తమిళ్ లో గార్గి అనే సినిమా చేసింది. ఆతర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి. ఆ టైం లో ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. సాయిపల్లవి ఇక పై సినిమాలు చేయదా.? పెళ్లి చేసుకుంటుందా.? అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఇక ఆ అనుమానాలు బ్రేక్ చేస్తూ తమిళ్ లో అమరన్ సినిమా చేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అమరన్ సినిమా తర్వాత తెలుగులో నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమా చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో రామాయణం సినిమా చేస్తుంది ఈ నేచురల్ బ్యూటీ.. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి మరో తెలుగు సినిమాకు గ్రీన్ సింగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో మూడో సారి జతకట్టనుంది సాయి పల్లవి. అలాగే తనకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడితో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
ఆ దర్శకుడు ఎవరో కాదు టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో సాయి పల్లవి ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటున్నారట. కాగా నాని, సాయి పల్లవి కలిసి ఎమ్.సీ.ఏ, శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ప్రస్తుతం నాని కూడా వరుస హిట్స్ తో జోష్ మీదున్నాడు. ఇటీవలే హిట్ 3తో సక్సెస్ అందుకున్నాడు. త్వరలోనే ప్యారడైజ్ సినిమాతో రానున్నాడు. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల సినిమా ఉంటుందని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి




