iBomma Ravi Case: ఐబొమ్మ రవి కోసం రంగంలోకి ఫేమస్ వకీల్ సాబ్.. గతంలో ఈ లాయర్ ఏయే కేసులు వాదించారో తెలుసా?

ఐబొమ్మ పైరసీ వెబ్ సైట్ అడ్మిన్ ఇమ్మడి రవి ని కాపాడేందుకు ఒక ప్రముఖ లాయర్ రంగంలోకి దిగారు. గతంలో పలు సంచలనాత్మక కేసులు వాదించిన ఆయన ఈ కేసులో ఇమ్మడి రవికి బెయిల్ సులభంగా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

iBomma Ravi Case: ఐబొమ్మ రవి కోసం రంగంలోకి ఫేమస్ వకీల్ సాబ్.. గతంలో ఈ లాయర్ ఏయే కేసులు వాదించారో తెలుసా?
Ibomma Ravi Case

Updated on: Nov 20, 2025 | 9:09 PM

ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న ‘ఐబొమ్మ’ కథ ఇక ముగిసినట్టే. ఈ పైరసీ వెబ్ సైట్ అడ్మిన్ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐబొమ్మ, బప్పం టీవీతో సహా మొత్తం 65కి పైగా పైరసీ వెబ్ సైట్లను అతని తోనే క్లోజ్ చేయించారు. దీంతో పైరసీతో కోట్లాది రూపాయలు నష్టపోయిన టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. పైరసీ కింగ్ పిన్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.అయితే మరోవైపు సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి మద్దుతుగా పోస్టులు కనిపిస్తున్నాయి. కొంత మంది అతనిని రాబిన్ హుడ్ తో పోల్చుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇమ్మడి రవి తరఫున వాదించేందుకు ఒక ఫేమస్ లాయర్ రంగంలోకి దిగారు. అతను మరెవరో కాదు గతంలో ఏపీ రాజకీయాలకు సంబంధించి రెండు ప్రధాన కేసులను వాదించిన లాయర్ సలీం. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడికి సంబంధించిన కేసు (కోడి కత్తి కేసు)ను ఈ న్యాయవాదే వాదించారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పై జరిగిన రాళ్లదాడికి సంబంధించిన కేసు (గులక రాయి కేసు)ను కూడా ఈ సలీం సాబే వాదించారు. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారికి బెయిల్ మంజూరయ్యేలా చేశారు. ఇప్పుడు ఐబొమ్మ రవి కేసు టేకాఫ్ చేయడానికి ముందుకు వచ్చారీ వకీల్ సాబ్.

‘ఇమ్మడి రవి పైరసీ చేసింది తప్పు అయితే, మాస్ జనాలు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. అతడిని హీరోలాగా చూస్తున్నారు. దాని వల్లే ఈ కేసుకి ఇంత హైప్ వచ్చింది. చట్ట ప్రకారం అతన్ని అరెస్ట్ చేసినట్లే, అదే చట్ట ప్రకారం ముద్దాయి తరపున వాదించడానికి నేను ముందుకు వచ్చాను. ఈ కేసు విషయమై ఇప్పటికే రవి తల్లిదండ్రులతో మాట్లాడాను. ఒక ముద్దాయి హక్కుల కోసం వృత్తి ధర్మంగా ఫైట్ చేస్తాను. నాకు తెలిసి ఈ కేసు చాలా సింపుల్. సైబర్ క్రైమ్ కేసులో రవికి ఈజీగా బెయిల్ వస్తుంది. ఇప్పటికే రవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈడీ ఇన్వాల్వ్ అయితే మాత్రం కేసు గ్రావిటీ పెరిగే అవకాశం ఉంది’ అని సలీం చెబుతున్నారు. మరి సలీం చెబుతున్నట్లు ఐబొమ్మ రవికి బెయిల్ వస్తుందా? రాదా? అన్నది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.