Hero Sree Vishnu: హీరో శ్రీ విష్ణు ఆ సినిమాను థియేటర్లో ఏకంగా 72 సార్లు చూశాడట.. మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు

టాలీవుడ్‌లో ఇప్పుడు మంచి రైజ్‌లో ఉన్న హీరో శ్రీ విష్ణు. త్వరలోనే ఈ కుర్ర హీరో  'గాలి సంపత్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ టాప్ డెరెక్టర్ రావిపూడి...

Hero Sree Vishnu: హీరో శ్రీ విష్ణు ఆ సినిమాను థియేటర్లో ఏకంగా 72 సార్లు చూశాడట.. మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు
ఆ సినిమా 72 సార్లు థియేటర్‌లో చూశా: శ్రీ విష్ణు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 10, 2021 | 5:10 PM

టాలీవుడ్‌లో ఇప్పుడు మంచి రైజ్‌లో ఉన్న హీరో శ్రీ విష్ణు. త్వరలోనే ఈ కుర్ర హీరో  ‘గాలి సంపత్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ టాప్ డెరెక్టర్ రావిపూడి సమర్పణలో అతని స్నేహితుడు ఎస్‌.కృష్ణ రచయితగా, నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనీష్‌కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్‌ తండ్రీ కొడుకులు నటించారు. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. తాజాగా  ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణుతో కలిసి విచ్చేశారు సమర్పకుడు అనీల్ రావిపూడి. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌తో పాటు అటు సోషల్ మీడియాతో తెగ సర్కులేట్ అవుతుంది.

ఈ ఇంటర్వ్యూలో పలు తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు హీరో శ్రీ విష్ణు. శ్రీవిష్ణు ఫిబ్రవరి 29న లీప్ ఇయర్‌లో పుట్టారట. అందుకే ప్రతి ఏడాది బర్త్ డే ఫిబ్రవరి 28న చేసుకుంటాడట. కావాలనే మీ పేరెంట్స్ ఆ డేట్‌కి ఫిక్స్ చేశారా.. అని అలీ అడగ్గా.. అలాంటిదేం లేదని శ్రీ విష్ణు క్లారిటీ ఇచ్చాడు. ఇదే క్రమంలో నువ్వు ఎక్కుసార్లు చూసిన సినిమా ఏది..? అంటూ శ్రీ విష్ణును అలీ ప్రశ్నించారు. క్షణం ఆలస్యం చేయకుండా  ‘నువ్వు నాకు నచ్చావ్’  అని సమాధానమిచ్చాడు విష్ణు. ఆ సినిమాను థియేటర్లలోనే ఏకంగా 72 సార్లు చూశాడట ఈ కుర్ర హీరో. ఇక టీవీలో ఎన్నిసార్లు చూశాడో మరి.

ఇక తాను ఇండస్ట్రీలో నిలదొక్కకోడానికి హీరోలు నారా రోహిత్, రామ్‌లు చాలా హెల్ప్ చేశారని చెప్పుకొచ్చాడు. ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద శ్రీ విష్ణు దర్శకత్వ శాఖలో కూడా పని చేశాడట. ఇక తనది ప్రేమ వివాహమని.. తన భార్య అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ సినిమాలను ప్రొడ్యూస్ చేసిందని చెప్పాడు శ్రీవిష్ణు.

Also Read:

బిర్యాని ప్యాకెట్లలో బంగారపు ముక్కు పుడకలు.. అందరూ షాక్.. అసలు విషయం ఇదే…

ఆటోతో ఢీకొట్టాడు.. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లమని చెబితే డ్రైవర్ కిరాతకం..