AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : హను రాఘవపుడి మూవీకి ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదా..? ఆ హీరో చేయాల్సిన సినిమానా ఇది..!

ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలు లైనప్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ హిట్ అందుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు సలార్ సినిమా విపరీతంగా నచ్చేసింది. డార్లింగ్ యాక్షన్ చూసి ప్రేక్షకులు ఆనందంలో తేలిపోయారు. సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్

Prabhas : హను రాఘవపుడి మూవీకి ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదా..? ఆ హీరో చేయాల్సిన సినిమానా ఇది..!
Prabhas
Rajeev Rayala
|

Updated on: Aug 22, 2024 | 5:48 PM

Share

ప్రభాస్ రూటే సపరేటు.. అవును రెబల్ స్టార్ అంటే మినిమమ్ ఉంటుంది మరి.. మిగతా హీరోలంతా ఒక్క సినిమా చేయడానికి కష్టపడుతుంటే.. ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలు లైనప్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ హిట్ అందుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు సలార్ సినిమా విపరీతంగా నచ్చేసింది. డార్లింగ్ యాక్షన్ చూసి ప్రేక్షకులు ఆనందంలో తేలిపోయారు. సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రభాస్. కల్కి సినిమాతో ఏకంగా సంచలన హిట్‌ను సొంతం చేసుకున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే మెంటలెక్కుతోంది ఫ్యాన్స్‌కి..

ఇది కూడా చదవండి : Prabhas : మా ప్రభాస్‌నే అంటావా.. బాలీవుడ్ నటుడి గాలి తీసేసిన హీరో నాని

మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపుడితో సినిమా చేస్తున్నారు. ఆతర్వాత సలార్ 2 , కల్కి 2లతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక హను రాఘవపుడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తోన్న సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పుర్జకార్యక్రమం కూడా జరిగింది. ఈ సినిమా 1940 టైం లో జరిగే యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి : Brahmamudi : సీరియల్‌లో పద్దతిగా.. బయట మాత్రం బికినీలో బీభత్సం

ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందుకు ప్రభాస్ ను హీరోగా అనుకోలేదట. హను రాఘవపుడి ముందుగా ఈ సినిమాకు మరో హీరోను అనుకున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. ఈ సినిమా కథను నేచురల్ స్టార్ నాని కోసం ముందుగా హను రాఘవపూడి డిజైన్ చేశారట. ఇప్పుడు ఈ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీతారామం సినిమా తర్వాత హను రాఘవపుడి నానితో సినిమా చేయాలనుకున్నారు. అప్పట్లో ఈ వార్త తెగ హల్ చల్ చేసింది. ఆ సినిమా కూడా పిరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని కూడా టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేశారు హను. అయితే నాని కోసం డిజైన్ చేసిన కథతోనే ఇప్పుడు ప్రభాస్ సినిమా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి, మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. సీతారామం సినిమాను కూడా హను రాఘవపుడి పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కించిన విషయం తెలిసిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
అక్టోబర్ 6 రాశిఫలాలు: వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్..
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
AI దెబ్బకు అమెరికాలో మూడు రెట్లు పెరగనున్న నిరుద్యోగం
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
బైక్‌లపై వచ్చి.. పిల్లులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్ట్
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
100 బిలియన్ డాలర్ల పెట్టుబడులే టార్గెట్..
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. వీడియో
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఆల్ ఫోకస్ ఆన్ సీఈసీ.. వాట్ నెక్ట్స్..? ఎన్నికల సంఘం నిర్ణయాలపై..
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు ఆఖరి అవకాశం.. అక్టోబర్ 9 లోగా
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు
మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్లు