Waltair Veerayya: బాస్‌రా బచ్చాస్ అని చెప్పండి.. వీరయ్య ఊచకోత.. కలెక్షన్ల సునామీ
వాల్తేరు వీరయ్య జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో మైలురాయి అందుకున్నారు మెగాస్టార్. 200 కోట్ల క్లబ్బులో జాయిన్ అయిపోయాడు వీరయ్య. మరి తెలుగులో వాల్తేరు వీరయ్య కంటే ముందు 200 కోట్ల క్లబ్బులో ఉన్న సినిమాలెన్ని..? ఏ హీరోకు ఎన్ని 200 కోట్ల సినిమాలున్నాయి..? టాప్‌లో ఉన్నదెవరు..?

వాల్తేరు వీరయ్యతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు చిరంజీవి. ఆయన నుంచి అసలైన బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు వాల్తేరు వీరయ్య రూపంలో ఖతర్నాక్ కమర్షియల్ సినిమా ఇచ్చారు మెగాస్టార్. తాజాగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. 10 రోజుల్లోనే ఈ ఘనత సాధించారు చిరు. వీరయ్య విజయంలో రవితేజ పాత్ర కూడా మరిచిపోలేనిది. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం.
రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి నుంచి లాభాల పరంగా వచ్చిన అతిపెద్ద బ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య. 90 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఇప్పటికే 220 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే చిరంజీవి 200 కోట్ల క్లబ్బులో చేరడం ఇది రెండోసారి. 2019లో విడుదలైన సైరా 236 కోట్లు వసూలు చేసింది. అయితే బిజినెస్ ఎక్కువగా చేయడంతో.. ఈ చిత్రం లక్ష్యానికి కాస్త దూరంలో ఆగిపోయింది.
మెగా కుటుంబంలో రామ్ చరణ్ సైతం రెండుసార్లు 200 కోట్ల క్లబ్బులో చోటు సంపాదించారు. నాలుగేళ్ళ కింద రంగస్థలంతో మొదటిసారి డబుల్ సెంచరీ కొట్టారు రామ్ చరణ్. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇక గతేడాది రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ 200 కోట్లేంటి.. ఏకంగా 1200 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటించారు.
Megastar’s ACTION PACKED BONANZA CONTINUES at Box Office with 200 CR+ Gross ??❤️?
Watch the MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya ? – https://t.co/KjX8J7HFFi@KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/4Ma7Fg21r3
— Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..