
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం డార్లింగ్ నటిస్తోన్న చిత్రాల్లో సలార్, కల్కి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ రెండు సినిమాల నుంచి గతంలో విడుదలైన గ్లింప్స్ చూస్తే మరోసారి ప్రభాస్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్స్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవైపు సోషల్ మీడియాలో ఈ మూవీస్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే కొన్ని సందర్భాల్లో కల్కి, సలార్ చిత్రాల నుంచి ఫోటోస్, వీడియోస్ నెట్టింట లీక్ అవుతున్నాయి. ఇప్పుడు అదే విషయంపై లీకర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్.
ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్వీన్ తెరకెక్కిస్తోన్న కల్కి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో డార్లింగ్ ఇప్పటివరకు కనిపించని సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. అలాగే భారీ తారాగణం, భారీ బడ్జెట్తో ఈ మూవీని ఏ రెంజ్ లో రూపొందిస్తున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇటీవల ఓ ఫోటో లీక్ అయ్యిందంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడిదే విషయంపై నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సీరియస్ అయ్యింది. ఈ మూవీకి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ లీక్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Legal Copyright Notice : #VyjayanthiMovies wishes to inform the public that #Kalki2898AD and all its components are protected by copyright laws. Sharing any part of the film, be it scenes, footage or images, is illegal and punishable. Legal action will be taken as needed, with… pic.twitter.com/wc3rRfRuDJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 21, 2023
“వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తోన్న కల్కి 2898 AD సినిమా కాపీరైట్స్ చట్టం ద్వారా పరిరక్షించబడుతుంది. ఈ మూవీకి సంబంధించిన అన్ని హక్కులు కేవలం నిర్మాణ సంస్థకు మాత్రమే చెందుతాయి. ఈ సినిమాలోని ఏదైనా భాగాన్ని, ఫోటోస్, వీడియోలను ఇతరులతో లేదా సోషల్ మీడియాలో పంచుకోవడం చట్టవిరుద్ధం. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం” అంటూ ట్వీట్ చేసింది వైజయంతి మూవీస్. ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు మేకర్స్.
𝐏𝐑𝐎𝐉𝐄𝐂𝐓-𝐊 is now #Kalki2898AD 💥
Here’s a small glimpse into our world: https://t.co/3vkH1VpZgP#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.