Indra: మెగాఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మళ్లీ థియేటర్లలోకి ఇంద్ర సేనుడు.. విడుదల ఎప్పుడంటే?
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బాగా గుర్తుండిపోయే చిత్రాల్లో ఇంద్ర (Indra) ఒకటి. బి.గోపాల్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసింది.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బాగా గుర్తుండిపోయే చిత్రాల్లో ఇంద్ర (Indra) ఒకటి. బి.గోపాల్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసింది. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) రానుంది. ఈ సందర్భంగా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేస్తూ తెగ హంగామా చేస్తున్నారు. ఈక్రమంలో ఇంద్ర సినిమా నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ (Aswani Dutt) మెగాస్టార్ అభిమానుల్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. నేటి ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఇంద్ర సినిమాను తీర్చిదిద్ది గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘డియర్ మెగా ఫ్యాన్స్.. ఇంద్రను 4కె వెర్షన్‌లో మీ ముందుకు తీసుకురానున్నాం. అయితే అది ఇప్పుడే కాదు. దానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఆరోజు కోసం మీరే కాదు మేం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఏది ఏమైనా మెగాస్టార్ సినిమా రీ రిలీజ్ మాత్రం గ్రాండ్ లెవల్‌లో జరగనుంది’ అని ఇందులో పేర్కొంది.
Not only u.. we are also.. We will be releasing 4K Print of #Indra, but not right now, it takes some time but the release will be in a BIG & GRAND Manner.
ఈ ట్వీట్‌తో మెగాభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వైజయంతీ మూవీస్ పోస్ట్‌పై స్పందిస్తూ నిర్మాతకు ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా ఇంద్ర సినిమాలో సోనాలీబింద్రె, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఇటీవల ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయ్యాయి. కాగా ఇటీవల మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డేను పురస్కరించుకుని జల్సా సినిమాను కూడా మళ్లీ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.