Vishwak Sen: నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా.. పృథ్వి కామెంట్స్ పై విశ్వక్ సేన్ క్లారిటీ
గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అభిమానులను పలకరించాడు విశ్వక్ సేన్. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించాడు. ఇప్పుడు లైలాగా మరోసారి మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడీ యంగ్ హీరో. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ప్రమోషన్లలో భాగంగా ఈనెల 17న సినిమా టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్.. ఈసారి లైలాగా ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించనున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది. లైలా సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దానికి కారణం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వి చేసిన కామెంట్స్.. సినిమా మొదలయ్యేటప్పుడు 150గొర్రెలు ఉన్నాయి. సినిమా చివరికి 11 గొర్రెలు అయ్యాయి అంటూ పృథ్వి చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారాన్ని రేపాయి.
దాంతో సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా అనే ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. దీని పై హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు క్లారిటీ ఇచ్చారు . ఈ మేరకు ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దాంట్లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఆ పలాన వ్యక్తి స్టేజి మీద ఏం మాట్లాడుతాడు అనేది మేము ఎలా కంట్రోల్ చేయగలుగుతాం. ఆయన స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను, నిర్మాత సాహు గారు చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకి వెళ్ళాము. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే సోషల్ మీడియా అంతా బాయ్ కాట్ లైలా అని కనిపించింది. మ్యాటర్ ఏంటి అని ఆరా తీస్తే అప్పుడు విషయం మాకు అర్థమైంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము అక్కడే ఉంటే కచ్చితంగా ఆపేవాళ్ళం లేదంటే అక్కడే క్షమాపణ చెప్పే వాళ్ళము. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి చదువు సంస్కారం నేను నేర్పియలేను కదా. స్టేజ్ మీద మాట్లాడిన ఆ వ్యక్తి అనుభవం అంతా వయసు లేదు నాకు. ఆయన అలా ఎందుకు మాట్లాడారు అనేది మాకు తెలియదు. సినిమాలో నటించాడు కాబట్టి స్టేజి మీదకి పిలిచి మాట్లాడమని చెప్పాము అంతేకానీ ఆయన ఏం మాట్లాడుతాడు అనేది మేము కంట్రోల్ చేయలేము. ఎవరో ఒకరు చేసిన తప్పుకు మా సినిమాను బలి చేయొద్దు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి మీడియా ముందుకు వచ్చాము..
సినిమాలో ఎన్ని గొర్రెలు ఉంటాయో.. చివరకు వచ్చేసరికి కూడా అన్ని గొర్రెలు మాత్రమే ఉంటాయి. మా సినిమా ఈవెంట్ లో జరిగింది కాబట్టి నేను సారీ చెప్తున్నాను. దయచేసి మా సినిమాను చంపేయకండి. మాది సినిమా ఈవెంట్ రాజకీయాలు మాట్లాడకూడదు.. కానీ అనుకోకుండా అలా జరిగింది. నాకు రాజకీయాలు మాట్లాడేంత అనుభవం కూడా లేదు. ఆయన మాట్లాడేటప్పుడు నేను ఎదురుగా ఉన్నానని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా.. అని విశ్వక్ సేన్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
